పంచముఖ శివలింగం అత్యంత అరుదుగా దర్శనమిస్తుంది. నాలుగు దిక్కులలో నాలుగు ముఖాలు, పైభాగంలో లేదా తూర్పు వైపున ఐదవ ముఖంతో శివుడు దర్శనమిస్తాడు.
పంచముఖ లింగం ప్రత్యేకత
పంచముఖ రుద్రాక్షమాలతో అలంకరించి, పంచగవ్యంతో అభిషేకం చేసి, బిల్వపత్రాలతో అర్చించి, ఐదు ఉపచారాలు, పంచ నైవేద్యాలతో పూజించడం శ్రేష్ఠంగా భావిస్తారు. ఈ ఐదు ముఖాల నుంచే శైవ ఆగమాలు ఆవిర్భవించాయని నమ్మకం.