పెళ్లి కుదరడం లేదా.. శివుడికి ఈ పూలు సమర్పించాల్సిందే!

Samatha

21 july  2025

Credit: Instagram

శ్రావణ మాసం వచ్చేస్తుంది. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ మాసం శివుడికి చాలా ప్రీతికరమైనది అంటుంటారు పెద్దవారు. 

అందుకే శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ ఎంతో నిష్టగా పరమేశ్వరుడిని కొలుచుకుంటారు. ఉపవాసాలు ఉంటూ శివయ్య నామస్మరణ చేస్తుంటారు.

అయితే కొంత మందికి వివాహం ఆలస్యం అవుతుంటుంది. అయితే అలాంటి వారు పరమ శివుడిని శ్రావణ మాసంలో పూజించాలంట.

అంతే కాకుండా ఈ మాసంలో శివయ్యకు పలు రకాల పూలు సమర్పించడం వలన త్వరగా పెళ్లి కుదిరే ఛాన్స్ ఉందని చెబుతున్నారు పండితులు.

కాగా, ఎలాంటి పూలు పరమ శివుడికి సమర్పిస్తే త్వరగా వివాహం కుదురుతుందో ఇప్పుడు చూద్దాం. బ్రహ్మ ముహుర్తంలో లేచి జలాభిషేకం చేయాలంట.

అదే విధంగా,  పరమేశ్వరుడికి తెల్లటి పూలు అంటే చాలా ఇష్టం అంట. ఈ రంగు పూలు సమర్పించడం వలన కోరిన కొర్కెలు నెరవేరుతాయి.

అలాగే పెళ్లి కాని వారు  పంచామృతంతో ఏకాదశ రుద్రాభిషేక్ం 11 సార్లు చేయడం, తెల్లటి పూలు సమర్పించడం వలన త్వరగా వివాహం కుదురుతుందంట.

అదే విధంగా పరమేశ్వరుడికి బిల్వపత్రాలు, మారేడు ఆకులను సమర్పించి, ఓం నమ : శివాయ అని రాసి ఆకులను సమర్పించడం మంచిదంట.