రాఖీ నుంచి వినాయక చవితి వరకు ఆగస్టులో ఉండే పండగలు ఇవే!

Samatha

21 july  2025

Credit: Instagram

ఈ సారి ఆగస్టు నెలలో అనేక పండుగలు రాబోతున్నాయి. కాగా, 2025లో ఆగస్టులో ఉండే హిందూ పండుగలు ఏవో చూసేద్దాం.

వరలక్ష్మీ వ్రతం ఆగస్టు8 : ఈరోజూ మహిళలు అందరూ ఉపవాసం ఉండి లక్ష్మీ దేవిని పూజించుకుంటారు. ప్రతి ఇంట్లో లక్ష్మీ దేవిని పూజిస్తారు.

రక్షా బంధన్ ఆగస్టు9 : అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముల్ల  బంధాన్ని తెలిపే ఈ పండుగ  ఈ సారి 9న వస్తుంది.

కృష్ణాష్టమి ఆగస్టు 16 : ఉట్టి కొడుతూ.. ఈరోజు శ్రీ కృష్ణుడి పుట్టిన రోజున ప్రతి ఊరిలో పల్లె పల్లెన ఘనంగా జరుపుకుంటారు.

వినాయక చవితి ఆగస్టు 27 : ఈ సారి ఆగస్టు నెలలో వినాయక చవితి 27వ తేదీన వస్తుంది. నేడు ప్రతి ఒక్కరూ వినాయకుడిని ఉపవాసాలు ఉంటూ పూజించుకుంటారు.

కజారి తీజ్ ఆగస్టు 12 : ఈరోజున మహిళలు అందరూ పాటలు పాడుతూ ఉపవాసం ఉండి తమ భర్త ఆయుషు పెరగాలని ప్రార్తిస్తారు.

పోలాల అమావాస్య : ఈరోజున పల్లెల్లోని రైతులందరూ తమ పంటపొలాల్లోకి వెళ్లి కాడెద్దులకు పూజ చేసి, అక్కడే విందు భోజనం చేస్తారు.