శివ కేశవులకు ఇష్టమైన మాసాల్లో కార్తీక మాసం ఒకటి. అందుకే ఈ మాసంలో శివుడు, విష్ణువులను పూజించడం వలన జీవితంలోని సమస్యలన్నీ తీరిపోతాయని చెబుతారు పండితులు.
కార్తీక మాసంలో నిత్యం శివకేశవుల పూజలు చేస్తూ, దానాలు, ధాన్యం, ఉపావాసాలు చేస్తూ, నిత్యం పూజలు చేయడం వలన మోక్షాన్ని పొందుతారని పురాణాలు చెబుతుంటాయి.
అయితే ఈ మాసంలో పూజలు చేయడమే కాకుండా, ఆహారాల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి అంటున్నారు పండితులు. అవి ఏవో చూద్దాం.
కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లో వెల్లుల్లిపాయ , బెండకాయ, పొట్లకాయ, కాకరకాయ, అస్సలే తినకూడదంట, ముఖ్యంగా ఈ మాసంలో విత్తనాలు ఉన్న పండ్లు అస్సలే తిన కూడదంట.
అదే విధంగా కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తీసుకోకూడదు అని చెబుతున్నారు పండితులు. ఇది మాంసాహారం తినడం చాలా చెడు ఫలితాలను ఇస్తుందంట.
కార్తీక మాసంలో చేపలు,మాంసం,గుడ్లతో సహా మాంసాహారం తింటే నరకానికి వెళ్తారని విశ్వాసం. అంతేకాదు ఈ సమయంలో బయటి ఆహారం తినడం కూడా మంచిది కాదంట.
కార్తీక మాసంలో ప్రతిరోజూ బెల్లంతినడం చాలా మంచిదంట.బెల్లం వాతావరణ మార్పులకు అనుగుణంగా రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
కార్తీక మాసం ప్రారంభంలో చలి ఎక్కువగా ఉంటుంది అందువలన ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో శీతల పానీయాలు, ఆహారం తీసుకోవద్దు. భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఈ నియమాన్ని అనుసరించండి.