ఇంట్లో సిరులు కురిపించే మొక్క.. కార్తీక పౌర్ణమి రోజు శివుడికి సమర్పిస్తే ఎంతో మంచిది!
27 october 2025
Samatha
అత్యంత పవిత్రమైన మాసాల్లో కార్తీక మాసం ఒకటి. కార్తీక మాసం సమయంలో శిడికి భక్తులందరూ ప్రత్యేకంగా పూజలు చేస్తూ, ఆయనకు ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తుంటారు.
కార్తీక మాసంలో శివుడిని ఎక్కువగా పూజిస్తుంటారు. అంతే కాకుండా శివుని అనుగ్రహం కలగాలని ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఆయనకు ఇష్టమైనవి సమర్పిస్తారు.
ఈ మాసంలో కఠిన నియమ నిబంధనలు పాటించడమే కాకుండా, శివారాధనలో కూడా శివుడికి ఇష్టమైన వాటితో పూజలు చేస్తారు, ముఖ్యంగా ప్రత్యేకమైన పూలు సమర్పిస్తారు
ముఖ్యంగా ఈ మాసంలో శివయ్యకు ఇష్టమైన బిల్వ పత్రాలు, దాతుర పత్రాలు, అపరాజిత, కమలం, రుద్రాక్ష, ఇలా అన్ని పూలు, పత్రాలతో పూజలు జరిపిస్తుంటారు.
అయితే ఇవే కాకుండా కార్తీక మాసంలో శివుడికి ఈ ప్రత్యేకమైన పువ్వు సమర్పించడం వలన ఇంట్లో సిరి సంపదలు కురవడమే కాకుండా, ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటదంట.
చాలా వరకు కమలం పువ్వులు లక్ష్మీ దేవికి, విష్ణు మూర్తికి ఎక్కువగా సమర్పిస్తుంటారు. కానీ ఈ పువ్వును శివుడి పూజలో కూడా వాడుతారని చెబుతున్నారు పండితులు.
ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ పువ్వును శివుడికి సమర్పించడం మంచిదంట. దీనిని శివ పూజలో శుధ్దఇ, ఆధ్యాత్మిక ప్రతీక కారణంగా ఉపయోగిస్తారు.
రుద్రాక్ష పువ్వులు శివుడికి చాలా ఇష్టం. అందువలన కార్తీక మాసంలో ఎవరైతే శివయ్యకు రుద్రాక్ష పూలు సమర్పిస్తారో వారికి శివుడి అనుగ్రహం కలిగి, చాలా మంచి ఫలితాలు కలుగుతాయంట.