కార్తీక మాసం ప్రారంభమైంది. అత్యంత పవిత్రమైన మాసాల్లో ఇదొక్కటి. ఈ మాసంలో ఎవరైతే శివ కేశవులను భక్తితో కొలుస్తారో, వారు అన్నింట శుభఫలితాలు పొందుతారంట.
హిందూ సంప్రదాయాల ప్రకారం కార్తీక మాసానికి ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే, ఈ మాసంలో ప్రతి ఒక్కరూ శివుడిని భక్తితో ఆరాధిస్తుంటారు.
అయితే ఈ మాసం చాలా పవిత్రమైనది కాబట్టి, కార్తీ మాసంలో అస్సలే కొన్ని పనులు చేయకూడదంట, ఒక వేళ తెలిసి తెలియక ఈ పనులు చేస్తే కష్టాలు తప్పవంటున్నారు పండితులు.
కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు ఆలోచనలు మనసులోనికి రానివ్వకూడంట. అంతే కాకుండా, వీలైనంత వరకు ఇతరులతో చెడు మాటలు మాట్లాడకుండా ఉండాలంట.
అలాగే కార్తీక మాసంలో ఎవరైతే వ్రతం పాటిస్తారో వారు, శారీరక సుఖాలకు దూరం ఉండాలని, నేలపై లేదా చాప పై మాత్రమే నిద్రించాలంట.
అదే విధంగా, కార్తీక మాసంలో అస్సలే మాంసాహారం తీసుకోకూడదంట. ఈ రోజుల్లో చాలా వరకు తాత్విక ఆహారం తీసుకోవడమే చాలా మంచిదంటున్నారు పండితులు.
కార్తీక మాసంలో ఎప్పుడూ కూడా అబద్దాలు పలకకూడదంట. అంతే కాకుండా ఈ రోజుల్లో తలకు నూనె రాసుకోవడం మానెయ్యడం చాలా మంచిదంట.
కార్తీక మాసంలో వీలైనంత వరకు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తల స్నానం చేసి దీపారాధన చేయాలంట. ముఖ్యంగా ఉపవాసం ఉండే వారు ఈ నియమాలు తప్పక పాటించాలి.