కార్తీక మాసం ప్రారంభం.. మీ ఇంట్లో ఈ మొక్క నాటితే అష్టైశ్వర్యాలు!
27 october 2025
Samatha
అత్యంత పవిత్రమైన మాసాల్లో కార్తీక మాసం ఒకటి. కార్తీక మాసం ప్రారంభమైంది. దీంతో చాలా మంది పరమ శివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తుంటారు.
అయితే మాసంలో నది స్నానం చేసినా లేక, శివయ్యకు పూజలు , అభిషేకాలు చేసినా మంచి ఫలితాలు కలుగుతాయి. కోరిన కోర్కెలు నెరవేరుతాయి అంటారు పండితులు.
అంతే కాకుండా కార్తీక మాసంలో ఉసిరి మొక్క నాటడం కూడా చాలా శుభప్రదం అంట. ఈ సమయంలో ఇంటిలో ఉసిరి మొక్క నాటడం వలన అనేక లాభాలు ఉన్నాయంట అవి :
కార్తీక మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ ఉసిరి చెట్టును పూజించి, ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తుంటారు. అంతే కాకుండా ఈ మాసంలో చాలా మంది దీని కింద భోజనాలు చేస్తుంటారు.
అయితే అంత పవిత్రమైన ఉసిరి చెట్టుపై లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెబుతుంటారు. అందుకే కార్తీక మాసంలో ఉసిరి చెట్టును ఇంట్లో నాటడం వలన అష్టై్శ్వర్యాలు లభిస్తాయంటారు
కార్తీక మాసంలో ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో ఉసిరి చెట్టు నాటడం వలన శుభ ఫలితాలు కలుగుతాయంట. అయితే దీనిని శుక్రవారం, అక్షయ నవమిలలో నాటడం చాలా శుభ ప్రదం.
ఉసిరి చెట్టు ఇంట్లో నాటుకోవడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఉసిరి చెట్టుపై దేవుళ్లు కొలువై ఉంటారు కాబ్టటి , దీని వలన మీ ఇంటిలోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుందంట.
అదే విధంగా,కుటుంబం జీవితంలో ఆనందం, శ్రేయస్సు కలగడమే కాకుండా, ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతారు అని చెబుతున్నారు పండితులు.