కోపం అనేది సహజం. ప్రతి వ్యక్తికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే కొందరు దీనిని ఎక్కువగా చూపిస్తే, మరికొందరు మాత్రం కోపాన్ని కంట్లోల్ చేసుకుంటారు.
ఇక కోపం అనేది చాలా చెడ్డదని చెబుతుంటారు పెద్దవారు. ఎందుకంటే అతి కోపం వలన అనేక సమస్యలు దరి చేరే అవకాశం ఉంటుంది.
ఈ అతి కోపం వలన తమ జీవితాన్నే నాశనం చేసుకున్న వారు కూడా లేకపోలేదు. అందుకే సాధ్యమైనంత వరకు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలంటారు.
కానీ కొంత మంది ఎంత ప్రయత్నం చేసినా కోపం అనేది కంట్రోల్‌లో ఉండదు. కానీ ఈ గుడికి వెళితే మాత్రం కోపం అనేది తగ్గిపోతుందంట.
ఇంతకీ ఆ గుడి ఏది అంటే? తిరుమురుగనాథేశ్వర ఆలయం. కోపం ఉన్న వారు ఇక్కడి వెళ్లి పూజలు చేస్తే కోపం తగ్గిపోతుందంట.
ఈ ఆలయం తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా, తిరుమురుగన్ పూండి అరుల్మిగులో ఉంది. ఇక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజిస్తారు.
ఇక ఇక్కడికి వస్తే ఎంత కోపమైనా తగ్గిపోతుందంట. ఎందుకంటే? పూర్వం దుర్వాసుడు అనే వ్యక్తి వీపరితీమైన కోపంతో ఉండే వాడంట. ఆయనకు ఎంతకు కోపం తగ్గకపోయేదంట.
అయితే ఆయన ఈ ప్రదేశానికి వెళ్లి సుబ్రహ్మణ్య స్వామిని, శివుడిని పూజించడం వలన కోపం తగ్గడమే కాకుండా, కోపం వలన చేసిన పాపాలను పొగొట్టుకున్నాడంట. అప్పటి నుంచి ఇక్కడి ఎంతో మంది కోపం వలన నష్టపోయిన వారు వచ్చి పూజలు చేస్తారంట.