ఇంట్లోకి గుడ్లగూబ వస్తే మంచిదేనా? పండితులు ఏమంటున్నారంటే?

Samatha

15 November 2025

చాలా వరకు గుడ్లగూబను అశుభకరం అంటుంటారు. అందుకే ఇది ఎదురు రావడానికి, కనీసం ఇంటిలోనికి కూడా రానివ్వరు ఎవ్వరూ కూడా.

ఇక గడ్లగూబ ఇంటిలోకి వచ్చిందంటే, వారిలో ఉండే భయం అంతా ఇంతా కాదు, ఏదైనా కీడు జరుగుతుందేమో అని చాలా భయపడి పోతుంటారు.

మరి నిజంగానే గుడ్లగూబ ఇంటిలోకి రావడం మంచిది కాదా? దీని గురించి పండితులు ఏం చెబుతున్నారు, అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటిలోకి ఎన్నో రకాల కీటకాలు, పక్షులు వస్తుంటాయి. అదే విధంగా కొన్ని సార్లు గుడ్లగూబ కూడా ఇంటిలోకి వస్తుంటుంది. దీంతో చాలా మంది భయాందోళనకు గురి అవుతారు.

గుడ్ల గూబ ఇంటిలోనికి వచ్చింది, ఏదో చెడు జరుగుతుందని భావించి, ఇంటిని వదిలి వేస్తుంటారు.గుడ్ల గూబ అశుభంగా భావిస్తారు.

కానీ గుడ్ల గూబ ఇంట్లోకి వస్తే చలా మంచిది అంటున్నారు పండితులు. ఎందుకంటే గుడ్ల గూబ లక్ష్మీ దేవి వాహనం అన్న విషయం అందిరికీ తెలిసిందే.

అందువలన గుడ్లగూబ ఇంటిలోపలికి వస్తే, మన ఇంట్లోకి లక్ష్మీ దేవి రాబోతుందని అర్థం అంట. అంతే కాకుండా ఇది శుభ సూచకం అంటున్నారు పండితులు.

ముఖ్యంగా గుడ్ల గూబ దీపావళి రోజున ఇంటిలోపలికి వస్తే చాలా మంచిదంట. ఈ పండుగ రోజు గుడ్ల గూబ రాకను శుభపరిణామంగా భావిస్తారంట. లక్ష్మీ దేవినే ఇంటిలోకి వచ్చిందని నమ్ముతారంట.