పెళ్లి రోజు వర్షం పడటం శుభమా? అశుభమా?

26 September 2025

Samatha

పెళ్లి అనేది రెండు వ్యక్తుల నిండు నూరేళ్ల జీవితం. ఇక వీరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం పెళ్లి. అందుకే పెళ్లిని ఎప్పుడు గుర్తుండిపోయేలా ఘనంగా జరుపుకోవాలని చూస్తారు.

అంతే కాకుండా, పెళ్లిలో ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా సాఫీగా జరిగిపోవాలి.కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల మధ్య అంగరంగ వైభవంగా జరగాలని కోరుకుంటారు.

ముఖ్యంగా చాలా మంది యువత పెళ్లి రోజు వర్షం పడకూడదనుకుంటారు. ఎందుకంటే? వివాహం రోజున వర్షం పడితే రిలేటివ్స్ చాలా ఇబ్బంది పడుతారు, ఇబ్బందికర వాతావరణం ఉంటుంది.

కానీ కొంత మంది మాత్రం వివాహం రోజు వర్షం పడితే, బియ్యం తిన్నారు అంటూ ముచ్చటిస్తారు. ఇంకొందరేమో వివాహం రోజు వర్షం పడటం చాలా మంచిదంటారు.

మరి అసలు వివాహం రోజున వర్షం పడటం శుభమా? అశుభమా? దీని గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

పెళ్లి రోజు వర్షం పడటం అదృష్టమంట. ఈరోజున వర్షంపడితే వధూవరుల జీవితం చాలా సంతోషంగా, ఐక్యంగా , జీవించడానికి సంపూర్ణ సంపద పొందుతారంట.

అలాగే వివాహం రోజు వర్షం పడితే , ఆ వధువరూలు తమ జీవితంలో సంతోషంగా ఉండటమే కాకుండా, మంచి ఎదుగుదల చూస్తారని నమ్మకం.

అదే విధంగా ఎవరి వివాహం రోజు అయితే వర్షం పడి ఆగిపోతుందో, వారి జీవితానికి కొత్త ప్రారంభ సంకేతం, వీరు చాలా ఆనందంగా జీవిస్తారని అర్థం. ====