కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా చేస్తే మీ జన్మధన్యమే! 

Samatha

15 November 2025

అత్యంత పవిత్రమైన మాసాల్లో కార్తీక మాసం ఒకటి. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ శివుడిని ఆరాధిస్తూ, నిత్యం పూజలు చేస్తుంటారు.

ఇక కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మాసంలో ప్రతి సోమవారం శివారాధన చేస్తూ, అభిషేకాలు చేస్తుంటారు.

అయితే కార్తీక మాసంలోని అన్ని సోమవారాలకంటే, చివరి సోమవారం చాలా గొప్పదని చెబుతున్నారు పండితులు. ఈ రోజు శివారాధన చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుందంట.

2025వ సంవత్సరంలో కార్తీక మాసంలోని చివరి సోమవారం నవంబర్ 17న రానున్న ది. అయితే ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి, పవిత్ర స్నానం ఆచరించి, దీపారాధన చేయాలంట.

ఈ కార్తీక మాసం చివరి సోమవారం రోజున ఎవరైతే శివాలయాన్ని సందర్శించి, పూజలు చేసి, దీపారాధన చేస్తారో వారికి శివుడి అనుగ్రహం కలుగుతుందంట.

అంతే కాకుండా, వారు చేసిన పాపాలు అన్ని తొలిగిపోతాయని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. అలాగే ఈ రోజు శివలింగాన్ని మారేడు పూలతో, బిల్వపత్రాలతో పూజించించడం మంచిది.

కార్తీక మాసం చివరి సోమవారం, శివుడిని పూజించడమే కాకుండా, ఈ రోజు మొత్తం శివ పంచాక్షరీ మంత్రం ఓం నమ: శివాయ అని జపించాలి. ఇది మీ మనసుకు ప్రశాంతతను అందిస్తుంది.

ఇక ఈ రోజున ఎవరైతే తమ ఇంటిలో సాయంత్రం సమయంలో ఇంటిని అందంగా దీపాలతో అలంకరిస్తారో, వారి ఇంటిలో సానుకూల శక్తి ప్రవేశిస్తుందంట. ఆ ఇంట ఆనందం, శ్రేయస్సు నెలకుంటుంది.