కార్తీక పౌర్ణమి రోజు ఎన్ని దీపాలు వెలిగించడం శుభప్రదమో తెలుసా?

Samatha

1 november 2025

కార్తీక పౌర్ణమికి ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యత గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈ రోజు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో శివకేశవులను ఆరాధించడం జరుగుతుంది.

అంతే కాకుండా ఈ రోజున శైవ క్షేత్రాలను సందర్శించి, భగవంతునికి కమలం, గరిక, దర్భ, అలాగే బిల్వ దళాలు, జిల్లేడులతో పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

అదే విధంగా కార్తీక పౌర్ణమి రోజు నది స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇలా నది స్నానం ఆచరించిన తర్వాత తప్పకుండా  దీపాలు వెలిగిస్తుంటారు.

కొంతమంది దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తే, ఇంకొంత మంది మాత్రం ఆలయాల్లో దీపాలు వెలిగించి,ఇంటి వద్ద కూడా దీపం పెడుతుంటారు. 

అయితే చాలా మందిలో ఓ డౌట్ ఉంటుంది. అది ఏమిటంటే? అసలు కార్తీక పౌర్ణమి రోజు ఎన్ని దీపాలు వెలిగించడం మంచిది అని? కాగా, దాని గురించి తెలుసుకుందాం.

కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వెలిగించే క్రమంలో తప్పకుండా కొన్ని నియమ నిబంధనలు పాటించాలంట. అంతే కాకుండా ఎప్పుడూ కూడా వాడిన దీపాలు మళ్ళీ వెలిగించకూడదంట.

ఇక కార్తీక పౌర్ణమి రోజు తప్పకుండా 27 దీపాలు వెలిగించాలి అని చెబుతున్నారు పండితులు. ఎందుకంటే. 27 దీపాలు అంటే 27 నక్షత్రాలని అర్థం దీని వలన అదృష్టం కలిసి వస్తుందంట.

అయితే చాలా మంది ఇన్ని దీపాలు వెలిగించడానికి ఇబ్బంది పడతారు. అయితే ఇది మీకు వీలు కాకపోతే, తప్పకుండా, తొమ్మిది దీపాలనైనా వెలిగించాలంట. తొమ్మది గ్రహాలు అని అర్థం.