కార్తీక మాసం వచ్చేసింది. నవంబర్ 5న కార్తీక పౌర్ణమి సెలబ్రేట్ చేసుకుంటారు. కాగా, కార్తీక పౌర్ణమికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.
కార్తీక పౌర్ణమి అంటే చాలు అందరికీ ముందుగా గుర్తు వచ్చేది, దీపాలు వెలిగించడం, ఈ రోజు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నదిస్నానం ఆచరించి, పూజలు చేసి దీపాలు వెలిగిస్తారు.
ముఖ్యంగా కార్తీక మాసంలో చాలా మంది ఉదయం నది స్నానం తర్వాత దీపాలు వెలిగించి నీటిలో వదిలిపెడతారు. కాగా దీని గురించి తెలుసుకుందాం.
అసలు కార్తీక పౌర్ణమి రోజే దీపాలను నీటిలో ఎందుకు వదులుతారు అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. అయితే దీని వెనుక ఓ కారణం ఉన్నదంట.
అన్ని మాసాల్లోకెళ్లా కార్తీక మాసానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా ఈ మాసంలో దీపం వెలిగిస్తే ఉంటే వెయ్యి రేట్ల ఫలితం ఉంటుందని పురాణాలు చెబుతుంటాయి.
ముఖ్యంగా ఆత్యను జ్యోతిగా భావిస్తారు, అయితే మన ఆత్మ జ్యోతిగా మారి పంచభూతలైన నటిలో కలిసి, ఆ పరమేశ్వరుడికి అంకితం చేయబడుతుందంట.
దీని వలన ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందంట. అంతే కాకుండా, శివుడికి చాలా ఇష్టమైన మాసం కార్తీక మాసం, అందువలన ఈ రోజు దీపాలు వెలిగించి నీటిలో వదలడం మంచిదంట.
నేడు నీటిలో దీపాలను వదలడం వలన గత జన్మలో చేసిన పాపాలతో పాటు, ఈ జన్మలో చేసిన పాపాలు కూడా నశించి పోయి, పరమేశ్వరుడి అశీర్వాదం లభిస్తుందంట. అందుకే కార్తీక పౌర్ణమి రోజున నీటిలో దీపాలు వదులుతారు.