సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. సంక్రాంతి పండుగ అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది, గొబ్బెమ్మలు, ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు, పిండి వంటలు, కోడి పందాలు, గాలిపటాలు.
సంక్రాంతి పండుగ
ముఖ్యంగా సంక్రాంతి పండుగ వస్తే చాలు చిన్న వారు , పెద్దవారు వయసుతో సంబంధం లేకుండా ఆనందంగా గాలిపటాలు ఎగరవేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.
వయసుతో సంబంధం లేకుండా
అయితే అసలు సంక్రాంతి పండుగకు గాలి పటాలు ఎందుకు ఎగరవేస్తారు. దీని వెనుకున్న కారణం, రహస్యం ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
గాలి పటం ఎందుకు ఎగరవేస్తారు?
పురాణాల ప్రకారం శ్రీరాముడు మకర సంక్రాంతి పండుగ రోజున ఆకాశంలో గాలిపటాన్ని ఎగరవేశాడంట. అలా శ్రీరాముడు ఎగరవేసిన గాలి పటం కాస్త ఇంద్రలోకానికి చేరింది. అప్పటి నుంచి గాలి పటాలు ఎగర వేస్తారు.
పురాణాల ప్రకారం
దీని వెనకున్న శాస్త్రీయ కారణం ఏమిటంటే? ఈ పండగ పూట చలి ఎక్కువగా ఉంటుంది. అందువలన ఈ సమయంలో ఉదయాన్నే గాలిపటాలు ఎగర వేయడం వలన సూర్యకిరణాలు శరీరాన్ని తాకి, ఆరోగ్యం బాగుంటుంది.
శాస్త్రీయ కారణం
సంక్రాంతి సూర్య భగవానుడికి అంకితం చేయబడినది. ఈరోజున సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశం చేస్తాడు. అందువలన ఇది సూర్య భగవానుడి పండుగగా చెబుతారు.
సూర్య భగవానుడు
అంతే కాకుండా ఈ సమయం చలికాలం పూర్తి అయ్యి, వసంత కాలం ప్రారంభాన్ని సూచిస్తుంది, వసంత కాలానికి స్వాగతం పలకడం కోసం ఈ రోజున గాలిపటాలు ఎగర వేస్తారంట.
వంసత కాల ప్రారంభం
ఇదే కాకుండా, సంక్రాంతి రోజు గాలిపటాలు ఎగరవేయడానికి మరో కారణం కూడా ఉన్నదంట. ఆరు నెలల తర్వాత దేవతలు నిద్ర నుంచి మేల్కొంటారని, వారికి స్వాగతం పలికేందుకు ఆకాశంలో గాలిపటాలు ఎగరవేస్తారంట.