పుట్టింటి నుంచి ఆడపిల్ల అస్సలే తెచ్చుకోకూడని వస్తువులు ఇవే!
Samatha
15 November 2025
చాలా మంది మహిళలు వివాహం తర్వాత పుట్టింటి నుంచి తమకు నచ్చినవన్నింటిని అత్తింటికి తీసుకొచ్చుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కొన్ని వస్తువుల పుట్టింటి నుంచి తీసుకొచ్చుకోకూడదంట.
వాస్తు శాస్త్రం ప్రకారం, ఆడపిల్లలు పుట్టింటి నుంచి కొన్ని రకాల వస్తువులను అత్తింటి తీసుకొచ్చుకోవడం వలన పుట్టింటి వారికే కాకుండా, అత్తింటి వారికి కూడా సమస్యలు వస్తాయంట.
కాగా, వాస్తు శాస్త్రం ప్రకారం, ఎలాంటి వస్తువులను అమ్మాయిలు పుట్టింటి నుంచి అత్తింటికి తీసుకొచ్చుకోకూడదు. వేటి వలన ఇంటిలో నష్టాలు వాటిల్లు తాయో ఇప్పుడు చూద్దాం.
ఏ ఆడపిల్ల అయినా సరే పుట్టింటి నుంచి ఉప్పు, చింత పండు తీసుకొచ్చుకోకూడదంట. దీని వలన ఆ ఇంటి ధనం , సంపద తగ్గిపోతుందంట.
చాలా మంది తమ పుట్టింటి నుంచి, ముగ్గు పిండి తీసుకొచ్చుకుంటారు. కానీ ఇది అశుభం. దీని వలన ఇంటిలోని అదృష్టం తగ్గిపోతుందంట. అందుకే అస్సలే ఇది తెచ్చుకోకూడదు.
అలాగే ఆడపిల్లలు ఎట్టి పరిస్తితుల్లో పుట్టింటి నుంచి, అత్తింటికి చీపిరి, బియ్యం తీసుకరాకూడదు. దీని వలన తల్లిగారి ఇంటి సంపద నశిస్తుందంట.
అదే విధంగా పూజలకు సంబంధించిన, కుంకుమ, పసుపు, దీపాలు వంటి పూజా సామాగ్రి కూడా ఆడపిల్లలు పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదంట.
చాలా మంది తెలిసి, తెలియక, ఎక్కువగా పుట్టింటి నుంచి కూరగాయలు, ఆకు కూరలు తెచ్చుకుంటారు. కానీ ఇవి పుట్టింటి నుంచి తెచ్చుకోవడం వలన ఇది తల్లిగారి ఇంటిలో సంతోషాన్ని దూరం చేస్తాయంట.