చాణక్య నీతి : ఇలాంటి పురుషులకు స్త్రీలు దూరంగా ఉండాలంట!

27 october 2025

Samatha

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఈయన భారత దేశంలోనే గొప్పవారిలో ఒకరిగా పేరుగాంచారు. ఈయన చాలా విషయాలను తెలియజేయడం జరిగింది. చాణక్యుడు గొప్ప తత్వవేత్త.

ఆ చార్య చాణక్యుడు నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, దాని ద్వారా ఎన్నో విషయాలను ఈ తరం వారికి తెలియజేశారు. అవి నేటి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి అనడంలో అతిశయోక్తి లేదు.

ఇక ఆయన బంధాలు బంధుత్వాలే కాకుండా, స్త్రీ, పురుషుల గురించి కూడా చాలా విషయాలు తెలిపారు. అలాగే ఆయన స్త్రీలు ఎలాంటి పురుషులకు దూరంగా ఉండాలో కూడా తెలియజేశారు.

స్త్రీ ఎప్పుడూ కూడా కొన్ని రకాల పురుషులకు చాలా దూరం ఉండాలంట, ముఖ్యంగా మహిళలు ఎప్పుడూ కూడా దురాశపరులైన పురుషులకు దూరం ఉండటం మంచిది.

వీరు స్నేహం, ప్రేమ కాకుండా, ముఖ్యంగా ఆమెను ప్రేమించకుండా, తన వెనకున్న డబ్బును ప్రేమిస్తారని చెప్పుకొచ్చారు. అలాంటి వారికి దూరం ఉండటమే మంచిదంట.

అలాగే కోపంగా ఉండే పురుషులకు కూడా దూరంగా ఉండటమే మంచిదంటున్నాడు చాణక్యుడు. ఎందుకంటే, అలాంటి వారితో జీవించడం నరకంతో సమానం, వారికి దూరం మంచిది.

ఏ పురుషునికి అయితే మద్యం, జూదం వంటి అలవాట్లు ఉంటాయో, వాటికి బానిసైన వ్యక్తికి దూరమే మంచిదంటున్నాడు చాణక్యుడు, వారు ఆలోచించకుండా డబ్బును వృధా చేస్తారంట.

అలాగే ఎప్పుడూ అనుమానంగా ఉంటూ,  చిన్న, పెద్ద విషయాలకు కూడా ఒక స్త్రీపై అనుమానం పెంచుకునే వ్యక్తికి ఎంత దూరం ఉంటే అంత మంచిదని చెబుతున్నాడు చాణక్యుడు.