చాణక్య నీతి : జీవితాన్ని నరకం చేసే వ్యక్తులు వీరే.. దూరం ఉంటేనే బతుకుతారు!
Samatha
7 november 2025
ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఈయన తన కాలంలోనే అత్యంత జ్ఞానవంతుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు, తెలివైన వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు.
ఇక ఆ చార్య చాణక్యుడు మానవుల కోసం ఎన్నో గొప్ప విషయాలను తెలియజేయడం జరిగింది. అవి నేటి తరం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి.
ఇక చాణక్యుడు, బంధాలు, బంధుత్వాలు, విద్య ,వైద్యం, ఆర్థిక సమస్యలు, భార్య , భర్త, సంబంధాలు ఇలా చాలా విషయాల గురిచి ఎంతో గొప్పగా తెలియజేసిన విషయం తెలిసిందే.
అదే విధంగా చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా, ఎలాంటి వ్యక్తులు జీవితాన్ని నరకం చేస్తారు? ఎలాంటి వ్యక్తులకు దూరం ఉండటం చాలా మంచిదో తెలియజేయడం జరిగింది.
కాగా ఎలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది, రోజులు గడిచే కొద్ది ఎవరికి దూరంగా ఉండాలి? ఎవరి నుంచి మీరు దూరంగా బతికితే మీ జీవితం గొప్పగా ఉంటుందో తెలుసుకుందాం.
చాణక్యుడి ప్రకారం, మీరు కష్టాల్లో ఉన్న సమయంలో ఏ వ్యక్తి అయితే మీకు సహాయం చేయరూ, అలాగే ఎవరు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని దూరం పెడతారో వారికి దూరంగా ఉండాలంట.
ఇలాంటి వ్యక్తులకు మీరు రోజులు గడిచే కొద్ది దూరం కాకపోతే, కాలక్రమేణ మీరు జీవించి ఉన్నప్పుడు భూమిపై నరకాన్ని అనుభవించక తప్పదు అంటున్నాడు ఆచార్య చాణక్యుడు .
అలాగే స్నేహితులు ఉండటం అనేది చాలా కామన్. జీవితంలో స్నేహితులు ఉండటం కూడా చాలా ముఖ్యం. కానీ వారిలో మంచి వారితో మాత్రమే మీ ప్రయాణం కొనసాగించాలంట.
ఆచార్య చాణక్యుడి ప్రకారం, ఒక చెడ్డ , దుష్ట స్నేహితుడు ఎల్లప్పుడూ తన స్వలాభం కోసం మీతోనే ఉంటారు. అలాంటి వారికి ఎంత త్వరగా దూరం అయితే అంత మంచిదంట.