చాణక్య నీతి : ఈ సంకేతాలు కనిపిస్తే మీకు అదృష్టం దూరమవుతున్నట్లే!

Samatha

31 october 2025

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు, తత్వవేత్త. ఈయన తన నీతి శాస్త్రం అనే పుస్తకం ద్వారా చాలా విషయాలను తెలియజేయడం జరిగింది.

విజయం అందరూ కోరుకుంటారు, కానీ కొంత మందిని మాత్రమే విజయం వరిస్తుంది. దాని ముఖ్యంకారణం కష్టంతో పాటు అదృష్టం కూడా తోడు అవ్వడం.

అయితే లక్కు ఉంటే ఏదైనా సాధించవచ్చు, కానీ కొంత మందికి మాత్రం అదృష్టం దూరం అవుతుంటుంది. లక్కు దూరం అయ్యే వారిలో కనిపించే లక్షణాలు ఏవో చూద్దాం.

ఆ చార్య చాణక్యుడి ప్రకారం, కర్మ అనేది మనిషికి నిజమైన సహచరుడు, నిరంతరం కష్టపడినా కొందరికి విజయం వరించదు, దానికి ముఖ్య కారణం లక్కు లేకపోవడం,

అయితే ఎవరికైతే, తమ సంబంధాలపై ప్రత్యేక్షప్రభావాన్ని చూపడం, చిన్న చిన్న మాటలకే, అపార్థాలు, మనస్పర్ధలతో బంధాల్లో దూరం పెరుగుతుందో వారికి అదృష్టం లేనట్లే.

అలాగే, అదృష్టం ఎవరి నుంచి అయితే దూరం అవుతుందో, వారి మనసులో నిత్యం భయం, ఆందోళన,  నిరాశ వంటివి పెరుగుతాయంట.

అదే విధంగా ప్రతి కూల ఆలోచనలు మీ మనస్సును గాయపరిచినా, ప్రశాంతతను, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయినా, మీ అదృష్టం మిమ్మల్ని విడిచిపెడుతుందని అర్థం చేసుకోవాలంట.

చాణక్య నీతి ప్రకారం, కొన్నిసార్లు మీ అదృష్టం మిమ్మల్ని వదిలివేస్తున్నప్పుడు, మీరు ఆర్థిక సమస్యలతో పోరాడటం, కొన్నిసార్లు, ఆర్థిక అడ్డంకులు, నష్టాలు వంటివి కలుగుతాయంట.