చాణక్య నీతి : మంచి రోజులని గృహ నిర్మాణానికి రెడీ అవుతున్నారా.. ఈ ప్లేసెస్‌లో మాత్రం ఇల్లు కట్టకండి!

Samatha

6 November 2025

కార్తీక మాసం కావడంతో చాలా మంది శుభ కార్యలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా, ఈ మాసంలో చాలా మంది గృహ నిర్మాణం కోసం ఏర్పాట్లు చేసుకుంటారు.

కొందరేమో గృహ ప్రవేశం చేయడం, మరికొంత మందేమో, గృహ నిర్మాణం కోసం ముగ్గు పోసుకోవడం వంటివి చేస్తారు, ఇంకొందరేమో ఇంటిలో శుభకార్యాలు జరుపుకుంటారు.

అయితే చాణక్యు డు చాలా విషయాల గురించి తెలియజేసిన విషయం తెలిసిందే. అదే విధంగా ఆయన ఇంటి నిర్మాణం విషయంలో కూడా కొన్ని సూచనలు చేశారు.

ముఖ్యంగా ఇంటిని నిర్మించుకునే వారు కొన్ని ప్రదేశాల్లో మాత్రం ఇంటిని నిర్మించుకోకూడదంట. కాగా, ఏ ప్రదేశాల్లో ఇల్లు నిర్మాణం చేపట్టకూడదో ఇప్పుడు చూద్దాం.

ఎక్కడైతే భయం, సామాజిక నిబంధనలు పాటించరో ఆ ప్రదేశాల్లో ఇల్లు నిర్మించుకోకూడదంట. అలాగే జన స్రవంతి ఎక్కువగా లేని చోట కూడా ఇంటి నిర్మాణం మంచిది కాదంట.

చాణక్య నీతి ప్రకారం, ఆసుపత్రి లేని చోట అలాగే ఎక్కడైతే ప్రాథమిక చికిత్స చేసే వైద్యుడు కూడా ఉండడో, ఆ చోట ఇంటి నిర్మాణం చేపట్టడం మంచిది కాదు.

అలాగే నీటి వనరు లేని చోట ఇంటి నిర్మాణం మంచిది కాదు, అంతే కాకుండా శ్మశానం దగ్గరగా ఉన్న చోట, పునాది తీసే క్రమంలో బొగ్గు ఎదురైనా ఆ చోట ఇంటి నిర్మాణం మంచిది కాదు.

అంతే కాకుండా బంధువులు, స్నేహితులు లేని చోట,  ఉద్యోగ అవకాశం లేని చోట, ఆర్థిక వనరులు లభించని చోట ఇంటి నిర్మాణం మంచిది కాదు అని చెబుతున్నారు నిపుణులు.