చాణక్య నీతి : ఈ విషయాల్లో సిగ్గు పడటం వలన నష్టం మీకే?

Samatha

22 November 2025

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన ఎన్నో విషయాల గురించి తెలియజేసిన విషయం తెలిసిందే. అదే విధంగా ఒక వ్యక్తి  ఎలాంటి విషయాల్లో సిగ్గు పడకూడదో కూడా తెలిపారు.

ఆ చార్య చాణక్యుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. చాణక్యుడు గొప్ప తత్వవేత్త,రాజకీయ వేత్తా, అన్ని విషయాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి.

చాణక్యుడు నీతి శాస్త్రం అనే పుస్తకం ద్వారా ,  నేటి తరం వారికి ఎన్నో విషయాలను తెలియజేశాడు. ఎలాంటి విషయాల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, బంధాలు , బంధుత్వాల గురించి చాలా గొప్పగా తెలిపారు.

అయితే కొంత మంది చాలా సిగ్గు పడుతుంటారు. కానీ ఇలా సిగ్గు పడటం వలన జీవితం అక్కడే ఆగిపోతుందని చెబుతున్నాడు చాణక్యుడు, కాగా, ఏలాంటి విషయాల్లో సిగ్గుపడకూడదో ఇప్పుడు చూద్దాం.

చాలా మంది అప్పు ఇచ్చి తిరిగి అడగడానికి ఎక్కువగా సిగ్గు పడుతుంటారు. అయితే అలా డబ్బు ఇచ్చి తిరిగి అడగడానికి సిగ్గు పడటం వలన చాలా నష్టపోవాల్సి వస్తుందంట

ఇక కొంత మంది ఆహారం తినే వద్ద కూడా చాలా సిగ్గు పడుతుంటారు. అందుకే తినే విషయంలో ఎప్పుడూ కూడా అస్సలే సిగ్గు పడకూడదు అని చెబుతున్నాడు చాణక్యుడు

అదే విధంగా ఏదైనా తెలియని విషయం గురించి నేర్చుకునే వద్ద కూడా కొందరు సిగ్గు పడుతుంటారు. కాగా, నేర్చుకునే వద్ద కూడా ఎప్పుడూ సిగ్గు పడకూడదు అని చెబుతున్నాడు ఆ చార్య చాణక్యుడు.

కొంత మంది తమ అభిప్రాయాలను వ్యక్త పరచడంలో కూడా సిగ్గుపడుతుంటారు. అందువలన అభిప్రాయాలు చెప్పే విషయంలో కూడా ఎప్పుడూ సిగ్గు పడకూడదంట.