చికెన్ బ్రెస్ట్‌ వర్సెస్ లిగ్‌పీస్.. దేనిలో ఎక్కవ ప్రోటీన్ ఉంటుందో తెలుసా?

14 November 2026

Anand T

చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు.ఇది టేస్ట్‌తో పాటు మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

చికెన్ బెనిఫిట్స్

ముఖ్యంగా జిమ్‌ చేసే వారు ప్రోటీన్‌ కోసం ఎక్కువగా చికెన్ తింటారు. అయితే చికెన్‌లోని ఏ పార్టులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందో చాలా మందికి తెలియదు.

ప్రోటీన్ మూలం

చికెన్‌లో ఎక్కువ శాతం ప్రోటీన్ ఛాతీ భాగంలో ఉంటుంది. 100 గ్రాముల ఛాతీలో సుమారు 30-31 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

బ్రెస్ట్‌ పార్ట్

ఇక కోడి లెగ్‌పీస్‌ భాగంలో ఛాతీ కంటే తక్కువ ప్రోటీన్ ఉంటుంది. అంతే కాదు కాళ్లలో ఛాతీతో పోల్చుకుంటే కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది.

లెగ్‌పీస్

కోడి ఛాతీలో శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది.

కండరాల పెరుగుదల

బరువు తగ్గాలనుకునే వారు చికెన్ బ్రెస్ట్ తినడం చాలా మంచిది. ఎందుకంటే అందులో తక్కువ కేలరీలు ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది.

వెయిట్ లాస్

చికెన్ బ్రెస్ట్ తిన్నప్పుడు, మనకు చాలా సేపటి వరకు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దీని వల్ల మనం తక్కువగా తింటాం.

ఆకలి నియంత్రణ

మనం తీసుకున్న ప్రోటీన్‌ను జీర్ణం చేయడానికి శరీరం ఎక్కువ శక్తిని వాడుకుంటుంది. దీని వల్ల జీవక్రియ పెరుగుతుంది.

జీవక్రియ

మొత్తంగా చూసుకుంటే అందరూ అనుకున్నట్టు చికెన్‌ లెగ్స్‌లో కాకుండా బ్రెస్ట్‌లోనే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఈ సారి చికెన్ తినేప్పుడు ఇది తెలుసుకోండి.

చెస్టే బెస్ట్