పచ్చి పాలు , వేడి పాలు.. ఆరోగ్యానికి ఏవి మంచివంటే?

Samatha

12 November 2025

పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. అందుకే చాలా మంది ఆరోగ్యం కోసం ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం పాలు తాగుతుంటారు.

అయితే చాలా మంది పాలు వేడి చేసుకొని తాగుతుంటారు. కానీ కొందరు మాత్రం పచ్చి పాలు తాగుతుంటారు. దీంతో అసలు ఈ రెండింటిలో ఏవి ఆరోగ్యానికి మంచిది అనే డౌట్ ఉంటుంది.

కాగా, ఇప్పుడు మనం పచ్చి పాలు, వేడి పాలు ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏవి మంచివో తెలుసుకుందాం. వేటి ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుందో చూద్దాం.

పచ్చి పాలు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ అది కొన్నిసార్లు అనారోగ్య సమస్యలకు కారణం అవుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

పచ్చి పాలలో ఈకోలి, లిస్టేరియా, సాల్మొనెల్లా వంటి హాని కలిగించే బ్యాక్టీరియా చాలా ఎక్కువగా ఉంటుందంట. దీని వలన కొన్ని పుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంటుందంట.

అందువలన వీలైనంత వరకు పచ్చి పాలు తాగకపోవడమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని సార్లు పచ్చి పాలు కడపు సంబంధమైన సమస్యలకు కారణం అవుతుందంట.

వేడి చేసిన పాలు తాగడం వలన శరీరం వేడిగా ఉంటుంది. అంతే కాకుండా ఇవి చాలా త్వరగా జీర్ణం అవుతాయి. అలాగే వేడి చేసిన పాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

అందువలన ప్రతి ఒక్కరూ రోజూ గ్లాస్ వేడి చేసిన పాలు తాగడం వలన ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. చర్మ ఆరోగ్యానికి, ఎముకల బలానికి చాలా ఉపయోగపడుతాయి.