వాస్తు టిప్స్ : ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు అస్సలే ఈ తప్పులు చేయకూడదంట!
samatha
8 MAY 2025
Credit: Instagram
వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరూ వాస్తు నియమాలు పాటించాలంటారు.
కానీ కొంత మంది మాత్రమే వాస్తు నియమాలు పాటించరు. దీంతో వారు అనేక సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది.
అందుకే వాస్తు శాస్త్ర నిపుణులు వాస్తు నియమాలు పాటించినప్పుడే జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి లేకపోతే తీవ్రమైన ప్రతికూల పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తుంటారు.
అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఈ తప్పులు మాత్రం అస్సలే చేయకూడదంట. చేస్తే కష్టాలను ఆహ్వానించినట్లే అంటున్నారు పండితులు. అవి :
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు తుమ్మడం చాలా అశుభకరం. మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు తుమ్మితే లేదా మరొకరు తుమ్మితే, మీరు కొద్దిసేపు ఇంట్లోనే ఉండాలి. లేకపోతే చెడు జరిగే ఛాన్స్ ఉంటదంట.
ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు, ఎడమ పాదాన్ని ముందు వేసి వెళ్లకూడదంట.కుడి పాదం మీ ఇంటి గుమ్మం నుంచి బయటకు వచ్చేలా చూసుకోవాలి.
వాస్తు శాస్త్రం కాకుండా, ఇంటి పెద్దలు ఇంటి నుండి బయటకు వెళ్ళే ముందు స్వీట్లు తినడం కూడదంట. తీపి తినడం వలన అశుభంమే కాకుండా ప్రతికూల శక్తి వెంట వస్తుందంట.
వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఎవరితోనూ గొడవ పడకూడదు లేదా ఎవరికీ చెడు, అశుభంగా ఏమీ మాట్లాడకూడదు. దీని వలన మీ పని పూర్తి కాదు.