కారణాలు కాదు.. జీవితంలో సక్సస్ అవ్వాలంటే,తప్పక ఇవి ఉండాల్సిందే!

Samatha

2 novembar 2025

సక్సెస్, సక్సెస్, ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట.  కొన్ని కారణాల వలన జీవితంలో సక్సెస్ అవ్వలేకపోయాను. ఇప్పుడు బాధపడుతున్నాను అంటూ చాలా మంది చెబుతుంటారు.

ఇంకొందరు అయితే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అనారోగ్య సమస్యలే నా ఎదుగుదలకు అడ్డంకిగా మారాయిని చెబుతుంటారు. కానీ ఇది దాట వేయడం మాత్రమే అంటున్నారు సక్సెస్ నిపుణులు.

నీలో పట్టుదల, ఆత్మస్థైర్యం ఉంటే సక్సెస్ నీదే, దానికి ఏ అడ్డంకులు రావు అని వారు నొక్కి చెబుతున్నారు. మీ అలవాట్లను మార్చుకున్నప్పుడే మీరు ముందుకు సాగుతారని సూచిస్తున్నారు.

సమస్యలు అనేవి కామన్, కానీ వాటిని మీరు ఎలా అధిగమిస్తున్నారనేదే మీ సక్సెస్‌ను చూపుతుంది. ఉదయం ఐదు గంటలకు నిద్ర లేచి మీ లక్ష్యంపై ఫోకస్ పెట్టండి.

మీరు ఒక రోజులో ఎలాంటి సిట్యూ వేషన్‌లో ఉన్నా, కనీసం గంట , రెండు గంటలు ఫోన్ చూడటం తప్పకుండా చేస్తుంటారు,  అది మీ కెరీర్ పై ప్రభావం చూపుతుంది.

అందుకే వీలైనంత వరకు మీరు ఫోన్‌లో ఇతరులతో గంటలు గంటలు మాట్లాడటం, ఎక్కువగా ఫోన్ చూడటం ఆపేసి, మీరు ఏం సాధించాలి అనుకుంటున్నారో దానిపై ఫోకస్ పెట్టాలంట.

ప్రణాళికలు వేయడం కాదు, వాటిని ఫాలో అవ్వడమే గొప్ప వ్యక్తి లక్షణం అంటున్నారు సక్సెస్ ఎక్స్ పర్ట్స్. జీవితంలో విజయం సాధించాలి అంటే, ప్రణాళికలు రూపొందించుకొని, వాటిని ఫాలో అవ్వాలంట.

అదే విధంగా చాలా మంది తమ ఓటమికి కుటుంబాన్ని ఎరగా వాడుతుంటారు. కానీ ఎప్పుడూ ఒకరి సక్సెస్‌కు ఏది అడ్డు కాదు, జీవితంలో చాలా మంది ఎన్నో కోల్పోయినా సక్సెస్‌ను అందుకున్నారంట.

వారు సక్సెస్ అందుకోవడానికి ముఖ్యకారణం, వారిపై వారికి ఉన్న నమ్మకం, దృఢమైన సంకల్పం, అదే వారిని గొప్ప స్థాయిలో నిలబెట్టింది, అందుకే మీ ప్రయత్నం, మీ కష్టమే మీకు సక్సెస్ ఇస్తుందంట.