ఈ ఒక్క అలవాటు మీ పిల్లలను ఆనందంగా, వారి మైండ్ షార్ప్‌గా చేస్తుంది!
samatha
10 MAY 2025
Credit: Instagram
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ మానసికంగా, శారీరకంగా వారు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటారు.
అంతే కాకుండా తమ పిల్లలకు బంగారం లాంటి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటారు. అయితే అలా చేయాలిఅంటే తప్పకుండ కొన్ని టిప్స్ పాటించాలంట. అవి
మీ పిల్లల మానసిక స్థితి బాగుండి, వారు తెలివిగా ఉండాలి అంటే తప్పకుండా తల్లిదండ్రులు రోజులో కనీసం 30 నిమిషాలు వారితో వ్యక్తిగతంగా మాట్లాడాలంట.
ఇది వారి మానసిక ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా, వారిలో ఆత్మవిశ్వాసాన్ని , భరోసాను పెంపొందిస్తుంది అంటున్నారు నిపుణులు. దీని వలన పిల్లలు చాలా ఆనందంగా ఉంటారంట.
వారితో కలిసి మాట్లాడటం, కలిసి వంట చేయడం, లేదా వారితో కలిసి కథలు చెప్పడం, గేమ్స్ ఆడటం వంటివి చేయడం వలన ఇది బంధాన్ని మరింత బలపరచడమే కాకుండా మీ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందంట.
ఈ రకమై కనెక్షన్ మీ పిల్లల్లో ప్రేమను పెంచుతుంది. అలాగే వారిలో తెలివి పెరుగుతుంది అంతే కాకుండా వారు చాలా ఆత్మవిశ్వాసంగా ఉంటారు అంటున్నారు నిపుణులు.
మీరు కనీసం రోజులో 20 నిమిషాలైనా సరే వారితో గడపడం వలన వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది. వారు చేసే పనులు, మాట్లాడే మాటలు ఇలా అన్నింట్లో తేడాను గమనించవచ్చు.