రెండు సంవత్సరాలు దాటిన పిల్లలకు తప్పకుండా పెట్టాల్సిన ఫుడ్ ఇదే!

samatha 

05 JUN  2025

Credit: Instagram

పిల్లల ఆరోగ్యంపై తల్లి చాలా శ్రద్ధ తీసుకుంటుంది. అంతే కాకుండా వారికి పెట్టే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు.

ఎదిగే పిల్లలు కాబట్టి వారికి రోగనిరోధక శక్తిని పెంచి, బలంగా తయారయ్యే ఫుడ్ పెట్టాలి. కానీ కొంత మంది తల్లులు మాత్రం తమ బిడ్డకు ఎలాంటి ఫుడ్ పెట్టలో తెలియక సతమతం అవుతారు.

అయితే రెండు సంవత్సరాలు దాటిన పిల్లలకు ఎలాంటి ఆహారాలు పెడితే వారు బలంగా, యాక్టీవ్‌గా ఉంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రెండు సంవత్సరాలు దాటిన పిల్లలకు ఎక్కువగా కూరగాయలు పెట్టాలంట. ఎందుకంటే వీరికి అనేక రకాల విటమిన్స్, మినరల్స్ కూరగాయల ద్వారానే అందుతాయి.

కనీసం రోజుకు ఒక కప్పు కూరగాయలు, పండ్లు ఇవ్వాలంట. ఇలా ఇవ్వడం వలన వారు ఇవి తిని బలంగా తయారవుతారంటున్నారు ఆరోగ్య నిపుణులు. హెల్దీగా కూడా ఉంటారంట.

అలాగే ప్రతి రోజూ పిల్లల డైట్ లో తప్పకుండా తృణధాన్యాలు ఉండాలంట. ఇవి వారిని సీజనల్ వ్యాధుల నుంచి కాపడుతాయి. అందుకే తప్పకుండా పిల్లలకు తృణధాన్యాలు పెట్టాలంట.

అలాగే పిల్లలకు పాలకు సంబంధించిన ఫుడ్ ఎక్కువగా పెట్టాలంట. ఎందుకంటే ఇది వారిలోని ఎముకల బలానికి తోడ్పడుతుంది. అందుకే పెరుగు, మజ్జిగ, పాలు, చీజ్, జున్ను తప్పకుండా పెట్టాలంట.

పిల్లలకు ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ అందించాలి. సీ ఫుడ్స్, బీన్స్, బఠానీలు, నట్స్, సోయా ఉత్పత్తులు, విత్తనాలు తప్పకుండా పిల్లల డైట్ లో చేర్చాలంట.