వేసవిలో మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే.. తప్పకుండా వారికి ఈ ఫుడ్ పెట్టాల్సిందే!
samatha
3 MAY 2025
Credit: Instagram
పిల్లల ఆరోగ్యం బాగుంటేనే ఏ తల్లిదండ్రులైనా సంతోషంగా ఉంటారు. వారికి చిన్న సమస్య వస్తే చాలు ఇద్దరూ తెగ అల్లాడి పోతుంటారు.
ఇక వేసవి వచ్చిందంటే చాలు చాలా రకాల అనారోగ్య సమస్యలు దరి చేరుతుంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు మాటి మాటికి వ్యాధుల బారిన పడుతుంటారు.
అందువలన చిన్న పిల్లలు వేసవిలో ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా వారి డైట్‌లో ఈ ఫుడ్స్ ఉండాల్సిందేనంట. అవి ఏవి అంటే?
వేసవిలో మీ పిల్లలు హైడ్రెట్‌గా ఉండటానికి సోరకాయ, రిడ్జ్ పొట్లకాయ వంటి కూరగాయలతో చేసి ఫుడ్ పెట్టాలి. ఇందులో ఉండే ఫైబర్ , విటమిన్ సి వారి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ప్రతి రోజూ పుచ్చకాయను తినిపించాలి. ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది. అంతే కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.
వేసవి కాలంలో పిల్లలకు నిమ్మకాయ నీళ్లు ఇవ్వడం చాలా మంచిది. ఇందులో విటమిన్ సి, ఎలక్ట్రో లైట్స్ ఉంటాయి. అందువలన వీటిని పిల్లకు ఇస్తే వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని పిల్లలను డీహైడ్రేషన్ సమస్య నుంచి రక్షించడానికి ఇవి దోహదపడుతాయి. అంతే కాకుండా వారి చర్మన్ని కాపాడుతాయి.
కీరదోస కూడా పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని పిల్లలకు ఇవ్వడం వలన వారు ఆరోగ్యంగా ఉంటారు.