ఊరికూరికే టెన్షన్,ఆందోళనకు గురవుతున్నారా.. బెస్ట్ యోగాసనాలు మీకోసం!

samatha 

20 JUN  2025

Credit: Instagram

ప్రతి రోజూ యోగా చేయడం వలన చాలా లాభాలు ఉన్నాయంటారు పెద్దవారు. అందుకే ప్రతి ఒక్కరు కనీసం ఉదయం కొద్దిసేపైనా యోగా చేయాలని సూచిస్తారు.

ఇక ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక కొంత మందికి శారీరక శ్రమ లేకపోవడం వలన అనేక సమస్యల బారిన పడుతున్నారు.

తీసుకుంటున్న ఆహారం జీవనశైలి కారణంగా వ్యాధులు, మానసిక ఒత్తిడి, ఆందోళన, టెన్షన్, అలసట వంటివి ఎక్కువ అవుతున్నాయి.

అందుకే తప్పకుండా యోగాసనాలతో మీ శరీరాన్ని మీరు కాపాడుకోని, ఆరోగ్యంగా ఉండాలని సూచిస్తున్నారు యోగానిపుణులు. కాగా టెన్షన్,ఆందోళన నుంచి బయటపడాలంటే ఏ ఆసనాలు వేయాలో చూద్దాం.

యోగా నిద్ర : ఇది మనసుకు చాలా ప్రశాంతతను, శరీరానికి విశ్రాంతిని ఇస్తుంది. అందుకే తప్పకుండా రోజులో ఒకసారి ఈ ఆసనం వేయాలంట. దీనిని ప్రతి రోజూ క్రమం తప్పకుండా చేయడం  వలన ఒత్తిడి తగ్గుతుంది, మానసికంగా దృఢంగా ఉంటారంట.

బాలాసన : బాలాసన వలన అలసట,టెన్షన్ దూరమైన శారీరకం, మానసికంగా దృఢంగా ఉంటారు. అంతేకాకుండా శరీరం చాలా తేలికగా, ఏదో బరువు దిగిపోయినట్లుగా అనిపిస్తుందంట.

సంచలిత్ మర్ఘరి ఆసనం : ఈ ఆసనం ప్రతి రోజూ 10 నిమిషాల పాటు వేయడం వలన వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కలగడమే కాకుండా,  మెడ నొప్పి, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలగుతుందంట. 

కపాలభాతి ఆసనం : ఈ ఆసనం వేయడం వలన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆందోళన, టెన్షన్, అలసట దూరం అవుతుందంట.