పుట్టకముందే నిర్ణయించబడతాయి.. మీ జీవితంలో మార్చలేనివి ఇవే : చాణక్యుడు
samatha
3 MAY 2025
Credit: Instagram
ఆచార్య చాణక్యుడు తన కాలంలో అత్యంత జ్ఞానవంతుడిగా కూడా పేరు పొందాడు. తన జీవితకాలంలో, ఆయన అనేక రకాల విధానాలను రచించాడు.
ముఖ్యంగా చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా మానవులకు ఉపయోగపడే అనేక విషయాల గురించి తెలియజేయడం జరిగింది.
వాటిని నేటి తరం వారు అనసరిస్తూ.. చాలా విషయాలను తెలుసుకుంటున్నారు. ఇక చాణక్యడు స్త్రీ, డబ్బు, ఓటమి, గెలుపు ఇలా అనేక విషయాలను తెలిపిన విషయం తెలిసిందే.
అంతే కాకుండా ఈయన ఏ వ్యక్తి అయినా పుట్టకముందే నిర్ణయించబడే కొన్ని విషయాలను కూడా ప్రస్తావించాడు. ఆ వ్యక్తి ఎంత ప్రయత్నించినా, జీవితానికి సంబంధించిన ఈ విషయాలను అతను ఎప్పటికీ మార్చలేడంట. అవి :
ఏ వ్యక్తి అయినా సరే ఎంత కాలం జీవిస్తారు అనేది ఆయన పుట్టక ముందే నిర్ణయించబడుతుందంట. దానిని మీరు ఎంత ప్రయత్నించిన మార్చేలురు అంటున్నాడు చాణక్యుడు.
అలాగే ఆచార్య చాణక్యుడి ప్రకారం, వ్యక్తి కర్మలు కూడా అతని పుట్టుకకు ముందే నిర్ణయించబడుతుందంట. ఈ జన్మలో ఒక వ్యక్తి ఎలాంటి పని చేస్తాడనేది గత జన్మలోనే నిర్ణయించబడి ఉంటుంది.
చాణక్య నీతి ప్రకారం, ఒక బిడ్డ తన తల్లి కడుపులో ఉన్నప్పుడు, అతను జీవితంలో ఎంత డబ్బు సంపాదిస్తాడో ,ఎంత దూరం చదువుతాడో నిర్ణయించబడుతుంది.
అంతే కాకుండా ఓ వ్యక్తి గత జన్మలోని చేపిన పుణ్య లు, పాపాల ద్వారా ఈ జన్మలో వారికి జీవితం ఉంటుందని ఆచార్య చాణక్యడు తెలియజేయడం జరిగింది