హైపో థైరాయిడ్ ఉంటే కనిపించే లక్షణాలు ఇవే!

Samatha

21 july  2025

Credit: Instagram

ప్రస్తుతం చాలా మంది మహిళలను వేధిస్తున్న అతి పెద్ద సమస్య థైరాయిడ్. ఇందులో రెండు రకాలు ఉంటాయి, హైపో థైరాయిడ్, హైపర్ థైరాయిడ్.

కాగా, ఇప్పుడు మనం హైపో థైరాయిడ్ ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి గల కారణాలు ఏవో వివరంగా తెలుసుకుందాం.

హైపో థైరాయిడిజం అనేది థైరాయిడ్ హార్మోన్ల లోపం వలన కలిగేది. దీని వలన జీర్ణక్రియ అనేది చాలా నెమ్మదిస్తుంది.

అయితే ఇది రావడానికి ముఖ్య కారణాలు అయోడిన్ అధికంగా తీసుకోవడం, రేడియోయోడిన్ థెరఫీ, కుటుంబంలో ఎవరికైనా ఉంటే ఇది వస్తుంది.

అయితే హైపో థైరాయిడ్ ఉన్న వారిలో పలు లక్షణాలు ఉంటాయంట. అవి, రోజంతా నీరసంగా, అలసిపోయినట్లు కనిపిస్తారు.

అంతే కాకుండా ఇది రోజూ వారీ పనులపై దృష్టి పెట్టే సామార్థ్యాన్ని తగ్గిస్తుందంట. అంతే కాకుండా ఆకలి కూడా తగ్గిపోతుందంట.

అలాగే హైపోథైరాయిడిజం ఉన్న వారికి ఎప్పుడూ నిద్రపోవాలనే భావన కలుగుతుందంట. అతి నిద్ర, ఆకలి తగ్గడం వలన బరువు పెరుగుతారంట.

ఈ సమస్యతో బాధపడే వారు చలిని అస్సలే తట్టుకోలేరంట. అంతే కాకుండా వీరిలో ఎక్కువ మలబద్ధకం సమస్య ఉంటుందంట.