క్రమం తప్పకుండా ఎక్కువ టీ తాగే వారిలో వచ్చే సీక్రెట్ వ్యాధులివే!

samatha 

22 JUN  2025

Credit: Instagram

టీని ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మందికి ఇష్టమైన దాంట్లో ముందు ఉండేది టీనే. ఎందుకంటే టీ రుచిని ఇవ్వడమే కాకుండా విశ్రాంతినిస్తుంది.

తలనొప్పి నుంచి ఉపశమనం అందిస్తుంది. అంతే కాకుండా ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించి, మెదడును చురుకుగా చేస్తుంది. అందువలన చాలా మంది టీ తాగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు.

అయితే ప్రతి రోజూ క్రమం తప్పకుండా టీ తాగడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కాగా, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టీ ప్రియులకు రోజుకు రెండు లేదా మూడు సార్లు కూడా టీ తాగడానికి ఇష్టపడుతారు. అయితే ఇలా రోజులో ఎక్కువ సార్లు టీ తాగడం వలన మలబద్ధకం సమస్య వస్తుందంట.

అదే విధంగా ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఎక్కవగా టీ తాగడం వలన ఇది జీర్ణక్రియ సాఫీగా సాగకుండా చేయడమే కాకుండా డీ హైడ్రేషన్ సమస్యకు కారణం అవుతుందంట.

అంతే కాకుండా ప్రతి రోజూ ఎక్కువ మొత్తంలో టీ తాగేవారిలో కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందంట. కాలేక క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉన్నదంట.

అదే విధంగా ప్రతి రోజూ ఎక్కువగా టీ తాగే వారిలో నిద్రలేమి సమస్య ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వలన వారు తీవ్ర అలసటకు గురి అవుతుంటారు.

ముఖ్యంగా గర్భంతో ఉన్న మహిళలు అస్సలే అతిగా టీ తీసుకోకూడదంట. ఎక్కువగా కెఫిన్ తీసుకోవడం వలన ఇది వారి బిడ్డకు మంచిది కాదని గర్భస్రావం కూడా అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందంట.