ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవడం లేదా... కారణాలివే!

samatha 

17 MAY 2025

Credit: Instagram

ప్రస్తుతం ప్రతి చిన్న అవసరానికి డబ్బు అనేది తప్పనిసరి అయిపోయింది. పైసా లేనిదే ఏ పని జరగడం లేదు అనేది వాస్తవం.

ఇక కొంత మంది ఎక్కువగా వర్క్ చేస్తూ డబ్బులు కూడబెడుతుంటారు. ఇంకొంత మంది మంచి ప్రాపర్టీతీసుకొంటారు. కానీ కొందరు సంపాదించినా రూపాయి కూడా వెనకవేయలేరు.

ముఖ్యంగా  చేతిలోకి లక్షల డబ్బులు వచ్చినా.. వాటిని పొదుపు చేయలేరు. వచ్చిన డబ్బు వచ్చినట్లే నీళ్లలా ఖర్చు అయిపోతుంది.

దీంతో చాలా మంది బాధపడుతుంటారు. అసలు మా వద్దకు ఎంత డబ్బు వచ్చినా అది పొదుపు ఎందుకు కావడం లేదు అని బాధపడుతారు.

కాగా, అలాంటి వారి కోసమే ఈ సమాచారం. మనీ పొదుపు చేయలేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు అవి ఏవో చూద్దాం.

ఆలోచించకుండా డబ్బును ఖర్చు పెట్టడం. చేతిలోకి డబ్బు రాగానే సరైన నిర్ణయం లేకుండా చిన్న చిన్న ఖర్చులకు వాడటం వలన డబ్బు పొదుపు చేయలేరంట.

కొంత మంది ఇతరులకు గొప్పగా చూపించుకోవడానికి ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కాగా, దీని వలన సంపద త్వరగా తగ్గిపోతుందంట. డబ్బు నిలవదు.

మనం సంపాదించే దాంట్లో కొంత భాగాన్ని పొదుపు చేయాలంట. ఏ మాత్రం డబ్బు పొదుపు చేయకపోయినా దాని వలన ఆర్థిక సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు.