ఫ్రిజ్‌లో చపాతీ పిండి పెడుతున్నారా..అయితే ఈ సమస్యలు తప్పవు!

Samatha

12 july  2025

Credit: Instagram

చపాతీ పిండి ఫ్రిజ్‌లో పెట్టడం అనేది చాలా వరకు కామన్. చాలా మంది చపాతీ పిండిని కలుపుకొని ఫ్రిజ్‌లో పెడుతుంటారు.

కానీ ఇది అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

బీజీ వర్క్ వలన కొందరు రాత్రి సమయంలోనే పిండిని కలుపుకొని, ఫ్రిజ్‌లో పెట్టి ఉదయం చపాతీలు చేస్తుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదంట.

అయితే పిండిని కలిపి ఫ్రిజ్‌లో పెట్టడం వలన దీనిపై హానికరమైన బ్యాక్టీరియా చేరుతుందంట. దీని వలన కడుపు సంబంధ సమస్యలు వస్తాయంట.

అలాగే, పిండి పోషకాలు కోల్పోవడం, రుచిని కోల్పోవడం జరుగుతుందంట. అలాగే, ఫ్రిజ్‌లో పెట్టిన చపాతీలు తినడం వలన గ్యాస్ సమస్యలు, ఎక్కువ అవుతాయి.

అదే విధంగా, ఫ్రిజ్‌‌లో పెట్టిన పిండితో చేసిన చపాతీలు తినడం వలన జ్వరం, తలనొప్పి, విరేచనాలు వంటి సమస్యలు అధికం అవుతాయంట.

అందుకే వీలైనంత వరకు చపాతీ పిండిని ఫ్రిజ్‌లో పెట్టకూడదంట. చాలా వరకు చపాతీ పిండి కలిపిన రోజే చపాతీ చేసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదంట.

అయితే చపాతీ పిండిని ఒక గిన్నెలో వేసి, తడి గుడ్డలో చుట్టీ గాలి చొరబడ కుండా పెట్టుకోవడం వలన పిండి పాడవదంట. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.