వద్దు గురూ.. భార్యకు అస్సలే చెప్ప కూడని పచ్చినిజాలివే!

Samatha

11 july  2025

Credit: Instagram

భార్య భర్తల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  ఇద్దరు వ్యక్తులు ఒకరిగా కొత్త జీవితం ప్రారంభిస్తారు.

కొత్తగా ఒక బంధం మొదలైనప్పుడు సంతోషం, బాధలు, గొడవలు  అనేవి కామన్. చాలా మంది ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటారు.

అయితే బంధంలో కొన్ని సార్లు భాగస్వామితో సమస్యలు అధికం కావచ్చు, అందుకే ఎలాంటి వాగ్వాదాలకు చోటు లేకుండా బంధం సాగిపోవాలంటే తప్పకుండా కొన్ని టిప్స్ పాటించాలంట.

భర్త కొన్ని విషయాలను భార్య దగ్గర దాచినప్పుడే ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవంట. ఒక వేళ చిన్నవే కదా అని మీరు అన్నీ చెప్పేస్తే అది సమస్యకు దారి తీస్తుందంట.

అయితే భర్త ఎప్పుడూ కూడా భార్య ఏదైనా విషయం పై మాట్లాడినప్పుడు, నువ్వు ప్రతి దానికి అతిగా స్పందిస్తావని చెప్పకూడదంట. దీని వలన ఇద్దరి మధ్య గొవలు ఎక్కువవుతాయంటున్నారు నిపుణులు.

అలాగే, భార్య ఏదైనా పని చేసినప్పుడు, లేదా మీకు సహాయం చేసిన తర్వాత ఇది అంత పెద్ద విషయం కాదు అని చెప్ప కూడదంట. 

అదే విధంగా భర్త ఎట్టి పరిస్థితుల్లో తమ భార్యకు నువ్వు చాలా సున్నితమైన వ్యక్తివి అని చెప్పకూడదంట. కొన్ని సార్లు ఇది కూడా దూరాన్ని పెంచుతుందంట.

అలాగే, ఎవరు మొదటి సారి క్షమాపణ చెప్పారు. ఇంట్లో ఎవరు ఎక్కువగా పని చేస్తున్నారు అని లెక్కలు వేసుకోకూడదంట. ఇది బంధాన్ని బలహీన పరుస్తుందంట.