కొలెస్ట్రాల్ మంచిదే కానీ..

Samatha

10 july  2025

Credit: Instagram

కొలెస్ట్రాల్‌లో చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ వలన గుండె పోటు ప్రమాదం ఉన్నప్పటికీ. కొలెస్ట్రాల్ మంచిదే అని కార్డియాలజిస్ట్ డాక్టర్ అలోక్ చోప్రా చెబుతున్నారు

ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ ఎలాంటి సమస్య వచ్చినా కొలెస్ట్రాల్ ప్రాబ్లం అని అంటారు. కానీ కొలెస్ట్రాల్ అనేది శరీరానికి, హర్మోన్లకు మెదడుకు చాలా అవసరం.

కానీ కొందరు కొలెస్ట్రాల్ 190 కంటే ఎక్కువ ఉంటే,  కొలెస్ట్రాల్  మెడిసన్ స్టాటిన్స్ తీసుకుంటారు. కానీ ఇది అందరికీ మంచిది కాదని తెలిపారు.

ఈ మెడిసన్ కొందరిలో ఉబ్బరం, దద్దుర్లు, తలనొప్పి, విరేచనాలు, వికారం , కడుపు నొప్పి వంటి సమస్యలను తీసుకొస్తాయి.

అంతే కాకుండా మెదడు పనితీరును కూడా తగ్గిస్తాయి, వీటి ప్రభావం కంటిశుక్లం, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని పేర్కొన్నారు.

స్టాటిన్స్ మంచివే కానీ, వాటిని తీవ్ర ప్రమాద సమయంలో స్వల్పకాలికంగా మాత్రమే సహాయపడుతాయి. కానీ కొందరు వీటిని తీసుకుంటూనే ఉంటారు.

ఇంకొందరు రక్తనాళాలలో వాపు వంటి సమస్యలు ఉంటే కొలెస్ట్రాల్ సమస్య అనుకుంటారు కానీ,  ఇది కొలెస్ట్రాల్ సమస్య కాదు.

తీసుకునే ఆహారం, ఒత్తిడి వంటి సమస్యల వలన  రక్తనాళాలలో వాపు వంటి సమస్యలు వస్తాయి కానీ చాలా మంది దీనికి కొలెస్ట్రాల్ కారణం అంటారు.

కానీ ఇది కొలెస్ట్రాల్ సమస్య కాదు, సమతుల్య ఆహారం, పండ్లు కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఆహారం తీసుకోవడం వలన ఈ కొలెస్ట్రాల్ ‌ను సరిచేయవచ్చును దీని కోసం మందులు తీసుకోవాల్సిన పనిలేదని పేర్కొన్నారు.