ఏంటీ బిర్యానీ రెడీ చేస్తున్నారా.. తెలుసుకోవాల్సిన సింపుల్ టిప్స్ ఇవే!

Samatha

6 july  2025

Credit: Instagram

బిర్యానీ తినాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ఇక రెస్టారెంట్‌లో కంటే ఇంట్లో అమ్మచేసిన బిర్యానీ తింటే ఆ కిక్కే వేరుంటుంది.

చాలా మంది ఇంట్లో తమ కుటుంబ సభ్యులకు టెస్టీ టెస్టీ బిర్యానీ చేసి పెట్టాలి అనుకుంటారు. ఇక ఆ బిర్యానీ ఫర్ఫెక్ట్ గా వస్తే వారి ఆనందం మాటల్లో చెప్పలేనిది

అయితే ఇంట్లో బిర్యానీ తయారు చేసుకునే క్రమంలో తప్పకుండా కొన్ని టిప్స్ పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

బిర్యానీ చేయడానికి బియ్యం చాలా కీలకం, నాణ్యమైన మంచి పొడవాటి బాస్మతి బియ్యం, బిర్యానీ చేయడానికి తీసుకోవాలి.

మంచి రుచికరమైన బిర్యానీ కోసం చికెన్ ముక్కలు బాగుండాలి. అలాగే వాటిని మసాలాలతో రాత్రిపూట మ్యారినేషన్ చేసుకోవాలి.

బిర్యానీ టేస్టీగా రావాలంటే దానిలో సుగంధ ద్రవ్యాలదే, కీలక పాత్ర, అందుకే బిర్యానీ తయారు చేసేటప్పుడు మంచి సుగంధ ద్రవ్యాలను ఉపయోగించాలి.

బియ్యం, ఇతర పదార్థాలు లోపల అంటుకోకుండా ఉండటానికి కొంత వరకు నెయ్యిని ఉపయోగించాలి. నాణ్యమైన నెయ్యి తీసుకోవాలి.

ఉల్లిపాయ లేకుండా బిర్యానీ ఎప్పుడూ అసంపూర్ణంగా ఉంటుంది. అందుకే బిర్యానీ కోసం తప్పకుండా మంచి ఉల్లిపాయను తీసుకొని వేయించుకోవాలి.

బిర్యానీ చేసేటప్పుడు పాత్ర కూడా కీలకం. అందుకే తప్పకుండా బిర్యానీ ఇంట్లో తయారు చేసేటప్పుడు అది ఉడకడానికి మంచి పాత్రను ఎంపిక చేసుకోవాలి.