మధ్యాహ్నం అతిగా నిద్రపోతున్నారా? ఈ సమస్యలు తప్పవు!

Samatha

23 August  2025

Credit: Instagram

మధ్యాహ్నం చాలా మది నిద్ర పోతుంటారు. మరీ ముఖ్యంగా లంచ్ చేసిన తర్వాత చాలా నిద్ర వస్తుంటుంది. దీంతో కొంత మంది కాసేపు కునుకు తీస్తారు.

అయితే మధ్యాహ్నం కునుకు తీయడం ఆరోగ్యానికి చాలా  మంచిది అంటుంటారు ఆరోగ్య నిపుణులు . కానీ ఈ కునుకు ఎక్కువసేపు తీయకూడదంట.

కొందరు రాత్రి సమయంలో సరిగా నిద్రపోకపోవడం వలన  మధ్యాహ్నం గంటలు గంటలు నిద్ర పోతారు. కానీ దీని వలన అనేక అనారోగ్య సమస్యలు దరి చేరే అవకాశం ఉన్నదంట.

మధ్యాహ్నం తిన్న తర్వాత ఎక్కువ సేపు నిద్ర పోవడం వలన  బద్దకం, చిరాకు, అలసట వంటి సమస్యలు తలెత్తుతాయంట.

అంతే కాకుండా   ప్రతి రోజూ మధ్యాహ్నం కునుకు సమయంలో 30 నిమిషాల కంటే ఎక్కువ సేపు నిద్రపోవడం వలన ఆరోగ్యం దెబ్బతింటుందంట.

అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండె సమస్యలు వంటి అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత 30 నిమిషాల కంటే తక్కువ లేదా 30 నిమిషాలు నిద్రపోయేవారికి అధిక రక్తపోటు వచ్చే అవకాశం చాలా తక్కువ అని వారే పేర్కొన్నారు.

అందువలన మధ్యాహ్నం అస్సలే ఎక్కువ సేపు నిద్రపోకూడదని, 30 నిమిషాలు మాత్రమే కునుకు తీయాలని ఆరోగ్య ని పుణులు సూచిస్తున్నారు.