అమావాస్య  రోజు ఈ పనులు చేస్తే దరిద్రమే!

Samatha

22 August  2025

Credit: Instagram

ఆగస్టు 23న అమావాస్య ప్రారంభం కాబోతుంది. అయితే ఈ రోజున అస్సలే కొన్ని పనులు చేయకూడదంట, చేస్తే దరిద్రం చుట్టుకుంటుందంట.

జ్యోతిష్య శాస్త్రంలో అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే అటువంటి రోజున ఎట్టి పరిస్థితుల్లో కొన్ని తప్పులు చేయకూడదంట.

అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకూడదంట. ఈ రోజున డబ్బు ఇస్తే అది ఎప్పటికీ తిరిగిరాదంట.

అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో ఉప్పు అరవుగా ఇవ్వకూడదంట. దీని వలన అప్పు పెరిగి, దరిద్రం చుట్టుకుంటుందంట.

అమావాస్య రోజున కొత్త బట్టలు, లేదా పాత బట్టలను ఎవ్వరికీ ఇవ్వకూడదంట. ఇలా ఇస్తే మీకు కష్టాకాలం ప్రారంభం అవుతుందంట.

అమావాస్య రోజున కొత్త కారు లేదా బైక్ కొనుగోలు చేయడం లేదా దూర ప్రయాణాలు చేయడం చేయకూడదంట. ఎందుకంటే ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటదంట.

ఇక అమావాస్య రోజున ఎవ్వరికైనా సరే కుంకుమ, పసుపు ఇవ్వకూడదంట. దీని వలన మీ అదృష్టం మొత్తం పోతుందని చెబుతున్నారు పండితులు.

అదే విధంగా అమావాస్య రోజున ఎట్టి పరిస్థిల్లో గోర్లు తియ్యడం, వెంట్రుకలు కట్ చేయడం చేయకూడదంట. ఇది  అస్సలే మంచిది కాదంట.