చాణక్య నీతి : గప్ చుప్..మనసులోని మాట ఎవరికి చెప్పకూడదో తెలుసా?

Samatha

21 August  2025

Credit: Instagram

ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన గొప్పపండితుడు. ఎన్నో అంశాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి.

ఇక చాలా మంది అన్ని విషయాలను ఇతరులతో పంచుకోవడం తెలివైన పని అనుకుంటారు. కానీ కొన్ని విషయాలను ఇతరులతో పంచుకోకూడదంట.

మీరు ప్రతి విషయాన్ని అందిరితో పంచుకోవడం వలన చాలా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాగా కొన్ని విషయాలను అందరికీ చె్పకూడదంటున్నాడు చాణక్యుడు.

కాగా, ఇప్పుడు మనం ఒక వ్యక్తి తన ఆలోచనలను ఎవరితో పంచుకోవాలి? ఎవరితో పంచుకోకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాం.

మీకు ఏ వ్యక్తిపై అయితే పూర్తి నమ్మకం ఉంటుందో, అలాగే ఎవరు మీ శ్రేయస్సును కోరుకుంటారో అతనికి మాత్రమే చెప్పాలంట.

చాణక్యుడి ప్రకారం, మంచి, చెడు సమయాల్లో మీకు తోడుగా ఉండే వారికి మీ మనసులోని మాటలను, మీ సమస్యలను చెప్పాలంట.

చాణక్యనీతి ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో బంధువులతో ఏం షేర్ చేసుకోకూడదంట. చాలా వరకు వారు అవమానాలకు గురి చేసే ఛాన్స్ ఉంటదంట.

శత్రువు లేదా, మీ పోటీ దారులకు ఎప్పుడు మీ సీక్రెట్స్ చెప్పకూడదు. వారు వాటిని ఆయుధంగా మార్చుకుంటారంటున్నారు చాణక్యుడు.

ఆచార్య చాణక్యుడు చెబుతూ.. మీ రహస్యాలు, మీ మనసులోని మాటలను పంచుకునే ఏకైక వ్యక్తి మీ భాగస్వామి. తనతోనే అన్నీ పంచుకోవాలంట.