వర్షాకాలంలో వాము ఆకులతో అద్భుత ప్రయోజనాలు!
Samatha
21 August 2025
Credit: Instagram
వాము ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దీనిని వర్షాకాలంలో తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
చాలా మంది ఇంట్లోనే చాలా సులభంగా పెంచుకునే మొక్కల్లో ఇదొక్కటి. చాలా మంది దీనిని ఇంట్లోనే పెంచుకుంటుంటారు.
వాము మొక్కను అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చునంట. దీని వలన కడుపు నొప్పి, జలుబు వంటి వ్యాధులు నయం అవుతాయని
చెబుతున్నారు నిపుణులు.
వర్షాకాలంలో చాలా మంది జలుబు, దగ్గుతో బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ ఆకులతో టీ పెట్టుకొని తాగితే చాలా మంచిదంట.
అలాగే, జీర్ణ సమస్యలతో బాధ పడే వారు కొన్ని వాము ఆకులను తీసుకొని, వాటిని నీటిలో మరిగించి, భోజనం తర్వాత తాగితే
జీర్ణసమస్యలు దూరం అవుతాయంట.
అంతే కాకుండా కడుపు ఉబ్బరం, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు.
రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని సూప్‌లు లేదా హెర్బల్ టీ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదంట.
చిన్న పిల్లలు ఎక్కువగా కడుపు నొప్పి సమస్యతో బాధపడతారు. ఆ సమయంలో ఈ ఆకులను తీసుకొని నలిపి కాస్త వేడి చేసి పొట్టపై రాస్తే కడ
ుపు నొప్పి తగ్గుతుందంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
PCOS గురించి ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాల్సిన 10 నిజాలివే!
చికెన్ తెచ్చే ముప్పు ఇదే.. ఎక్కువ తింటే ఖతమే!
చాణక్య నీతి : ఎవరి ఇంట్లో లక్ష్మీ దేవి కొలువై ఉంటుందో తెలుసా?