అరే ఎలా మిస్ అయ్యాం.. చిన్న చిట్కాతో కరెంట్ బిల్లు తగ్గించుకోవచ్చు!
Samatha
22 August 2025
Credit: Instagram
ప్రతి నెలా వచ్చే కరెంట్ బిల్లు చూసి చాలా మంది భయపడి పోతుంటారు. ఇంటి రెంట్, కరెంట్ బిల్లు వచ్చేసరి ఏంటీ ఇంత బిల్లు వచ్చిందని ఆశ్చర్యపోతారు.
ఎందుకంటే చాలా మంది లైట్, ఫ్యాన్స్ లేకుండా ఉండలేరు. దీంతో ఎక్కువగా విద్యుత్ ఖర్చు అవుతూ, కరెంట్ బిల్లు కూడా చాలా ఎక్కువగా వస్తుంటుంది.
అయితే మీరు చాలా సులభంగా మీ కరెంట్ బిల్లు తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ అద్భుతమైన చిట్కాలు.
80W సీలింగ్ ఫ్యాన్స్ చాలా మంది యూజ్ చేస్తుంటారు. దీని వలన 48 యూనిట్స్ విద్యుత్ ఖర్చు అవుతుంది. అందువలన BLDC మోటార్లు ఉన్న ఫ్యాన్ వాడటం వలన నెలకు 87 యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందంట.
పాత 40W ట్యూబ్ లైట్స్ స్థానంలో 18W LED ఉపయోగించడం వలన నెల రోజులకు దాదాపు 26 యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేయవచ్చునంట.
మురికిగా ఉండే కండెన్సర్ కాయిల్స్ ఉన్న ఎయిర్ కండిషనర్లు అవసరమైన దానికంటే ఎక్కువ విద్యుత్‌ను తీసుకుంటాయంట. దీని వలన 15 శాతం పెరుగుతుందంట.
అందుకే ప్రతి 15 రోజులకు ఒకసారి కాయిల్స్ శుభ్రం చేయడం తక్కు ఉష్ణోగ్రత వద్ద వాటిని సెట్ చేయడం వలన చాలా వరకు విద్యుత్ ను ఆదాచేయవచ్చునంట.
టీవీ చూడటం, ఛార్జింగ్‌లు , సెటప్ బాక్స్‌ల వాడకం కాస్త తగ్గించడం వలన దాదాపు నెలకు 5 నుంచి 10 యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేయవచ్చునంట.