వామును అతిగా తీసుకుంటున్నారా... ఈ సమస్యలు తప్పవు!

samatha 

14  JUN  2025

Credit: Instagram

వాము ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది దీనిని తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

ముఖ్యంగా కఫం సంబంధ సమస్యలు, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది వామును ఉపయోగిస్తూ ఉంటారు.

అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని వామును అతిగా తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

కాగా, వామును అధికంగా తీసుకోవడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

దీర్ఘకాలికంగా గ్యాస్, గుండెల్లో మంట సమస్యలతో బాధపడేవారు వామును అధికంగా తీసుకుంటారు. కానీ దీని వలన గుండెల్లో మంట తగ్గించడానికి బదులుగా.. యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు తలెత్తుతాయంట.

అలర్జీ ఉన్నవారు వాముకు దూరంగా ఉండాలంట, వీరు పొరపాటున వాము తింటే.. తల తిరగడం, వికారం వంటి సమస్యలు వస్తాయి. 

 వాము నోటిలో మంట కలిగించే అనేక బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటాయి. అయితే, దీనిని అతిగా తినడం వలన నోట్లో పుండ్లు లాంటి సమస్యలు తలెత్తుతాయి. 

గర్భంతో ఉన్నవారు వాముకు దూరంగా ఉండటం మంచిది. వాము.. పిండం అభివృద్ధిని అడ్డుకుంటుంది.