ఏంటీ రోజూ టీ ఎక్కువగా తాగేస్తున్నారా.. అయితే మీ ప్రాణం ప్రమాదంలో ఉన్నట్లే!

Samatha

30 october 2025

టీ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ దీనిని అతిగా తాగడం వలన అనేక అనారోగ్య సమస్యలు దరి చేరే అవకాశం ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

టీ అనేది కొందరికి భావోద్వేగం, మరికొంత మందికి జ్ఞాపకం లాంటిది. అయితే చాలా మంది ఉదయం లేచిన వెంటనే ఎక్కువగా టీ తాగుతుంటారు.

ఇంకొందరైతే ఉదయం లేచిన వెంటనే టీ తాగనిదే ఆ రోజే గడవనట్లు ఉంటుందని చెబుతుంటారు. అంతలా టీకి అలవాటు పడిపోతుంటారు.

ఇక ఆఫీసుల్లో పని చేసే వారి గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పని లేదు. వారు రోజుకు రెండు నుంచి మూడు నాలుగు సార్లు టీ తాగుతూనే ఉంటారు.

ఇంకొంత మంది అయితే ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు టీ తాగుతూనే ఉంటారు. కానీ ఇలా అతిగా టీ తాగడం వలన సైడ్ ఎఫెక్స్ వచ్చే ప్రమాదం ఉన్నదంట.

సాధారణంగా రోజుకు రెండు నుంచి 3 కప్పుల టీ తాగడం ఆరోగ్యానికి మంచిది, ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ మీలో యాక్టివ్ నెస్‌ను పెంచుతాయి. కానీ రోజుకు 5 కప్పులకు మించి తాగితే ప్రమాదం అంట.

రోజూ ఎక్కువ టీ తాగే వారిలో కెఫిన్ ప్రభావం వారి శరీరంపై ఎక్కువగా చూపిస్తుంది. దీంతో ఆందోళన చికాకు వంటివి పెరుగుతాయి, ఐరన్ లోపం వచ్చి రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంటుంది.

అదే విధంగా జీర్ణ సమస్యలు, గ్యాస్, ఎసిడిటీ, వంటివి, అధిక చక్కెరతో టీ తాగడం వలన ఊబకాయం, డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుందంట