టీని అతిగా మరిగిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Samatha

23 August  2025

Credit: Instagram

టీ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. చాలా మంది ఉదయం లేచిందంటే చాలు టీ తాగడానికే ఎక్కువ ఇష్టం చూపుతారు. ఎందుకంటే ఇది మైండ్ రీ ప్రెష్ చేస్తుంది

అందుకే చాలా మంది ఎక్కువ టీ తాగుతారు. కొంత మంది రోజుకు ఒకసారి టీ తాగితే, మరికొంత మంది మాత్ర ఉదయం, సాయంత్ర  టీ తాగుతూ ఉంటారు.

ఇక టీ చాలా టేస్టీగా ఉంటే ఒక కప్పు కాదండోయ్, రెండు మూడు కప్పుల టీ కూడా తాగేస్తుంటారు. కానీ ఇలాంటి టీ మాత్రం తాగకూడదంట.

అయితే కొంత మంది టీ చాలా టేస్టీగా ఉండాలని ఎక్కువగా మరగపెడుతుంటారు. మరి టీని అతిగా మరగబెట్టడం మంచిదేనా?

కాగా, ఇప్పుడు మనం టీని ఎక్కువసేపు మరగబెట్టి తాగడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయి. దీని వలన కలిగే సమస్యలేవో చూద్దాం.

ఎక్కువ సేపు మరగబెట్టిన టీని తాగడం వలన దానిలో టానిన్ పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యకు కారణం అవుతుందంట.

అలాగే అతిగా మరిగిన టీ తాగడం వలన ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు నిపుణులు. ఎసిడిటీ, అజీర్థి వంటి సమస్యలు వస్తాయంట.

ఎక్కువ సేపు వేడి చేసిన టీ తాగడం వలన అధిక రక్తపోటు, గెండు ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉన్నదంట.