పెంపుడు జంతువులంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందుకే చాలా మంది తమ ఇంటిలోపల కుక్క లేదా పిల్లలను ఎక్కువగా పెంచుకుంటారు.
అయితే ఇలా పెంపుడు జంతువులను సాదుకునే వారు ఎట్టి పరిస్థితుల్లో తమ ఇంట్లో కొన్ని రకాల మొక్కలను పెంచకూడదంటున్నారు నిపుణులు. అవి ఏవంటే?
హైడ్రేంజ పూలు చాలా అందంగా ఉంటాయి. అందుకే చాలా మంది వీటిని ఇంటికి అందం తీసుకొస్తాయని, ఇంటిలో పెంచుకుంటూ ఉంటారు. కానీ వీటిని పెంచుకోకూడదంట.
ఎవరైతే కుక్కలను తమ ఇంటిలో పెంచుకుంటారో వారు అస్సలే ఈ తోటను పెంచుకోకూడదంట. వీటిని తినడం వలన కుక్క ఆరోగ్యం దెబ్బ తిని, ప్రాణం పోయే ప్రమాదం ఉంటుందంట.
అజలేయా అనే మొక్కను కూడా పెంపుడు జంతువులు ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లో పెంచుకోకూడదంట. వీటిని జంతువులు తింటే వాటికి విరేచనాలు, అయ్యే ప్రమాదం ఉన్నదంట.
ఉల్లిపాయ లేని వంటే ఉండదు. కానీ ఉల్లి పాయ మొక్కలను కూడా కుక్క పెంచుకునే వారు ఇంటిలోపల పెంచుకోకూడదు అని చెబుతున్నారు నిపుణులు.
గన్నేరు పూలు. ఇవి చూడటానికి అచ్చం గులాబీలా కనిపిస్తాయి, ఇంటికి అందం తీసుకొస్తాయి. కానీ ఈ మొక్కలు ఇంటిలో పెంచుకోవడం వలన వీటిని తింటే కుక్కలు, మానవులకు కూడా ప్రమాదమేనంట
రోడోడెండ్రాన్ మొక్కలు కూడా చాలా అందంగా ఉంటాయి. కానీ వీటిని పెంపుడు జంతువుల పెంచుకునే వారు ఎట్టి పరిస్థితుల్లో తమ ఇంటిలో పెంచకోకూడదంట.