ఏంటీ అస్సలే ఆకలి అవ్వడం లేదా.. కారణం ఇదేనేమో!

11 September 2025

Samatha

ఆకలి అవ్వడం కూడా గొప్ప వరం అంటారు పెద్దవారు. ఎందుకంటే? కొంత మందికి ఎంత తినాలి అన్నా అస్సలే ఆకలిగా అనిపించదు.

దీంతో వారు చాలా ఇబ్బంది పడుతుంటారు. మరి అసలు ఎందుకు ఆకలిగా అనిపించదు, ఆకలి తగ్గడానికి కారణం ఏంటో చూద్దాం.

కొందరికి తరచూ ఆకలి కాకపోవడం, అలాగే కొంచెం అన్నం తిన్నగానే కడుపు నిండిన భావన కనిపించడం జరుగుతుంది.

అయితే దీనికి ముఖ్య కారణం విటమిన్ బీ1 లోపం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో విటమిన్ బీ1 కీలకంగా వ్యవహరిస్తుంది.

ఇది శరీరంలో మందగించినప్పుడు ఆకలి అవ్వకపోవడం, కొంత ఆహారం తీసుకోగానే కడుపు నిండిన భావన కలగడం జరుగుతుందంట.

అంతే కాకుండా, జీర్ణవ్యవస్థ దెబ్బతినడం, మానసిక గందరగోళం, చిరాకు, వంటి సమస్యలు తలెత్తుతాయంట.

అందుకే ఈ సమస్యతో బాధపడే వారు తప్పకుండా విటమిన్ బీ1 ఉండే ఆహారాలను తీసుకోవాలంట. దీని వలన సమస్యను తగ్గించుకోవచ్చు.

ముఖ్యంగా పప్పుధాన్యాలు, ఆకు కూరలు, వాల్ నట్స్, వేరు శెనగలు, పొద్దుతిరుగుడు విత్తనాలు తీసుకోవడం చాలా మంచిది.