పచ్చి బీట్ రూట్ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
Samatha
25 july 2025
Credit: Instagram
బీట్ రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ఆరోగ్య నిపుణులు తప్పకుండా ప్రతి ఒక్కరూ బీట్ రూట్ తీసుకోవాలని సూచిస్తారు.
అయితే కొంత మంది బీట్ రూట్‌ను పచ్చిది తీసుకుంటే మరికొందరు బీట్ రూట్‌తో రకరకాల వంటలు చేసుకొని దానిని తీసుకుంటారు.
మరి పచ్చి బీట్ రూట్ తినడం మంచిదేనా అనుమానం చాలా మందిలో ఉంటుంది. కాగా, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం.
పచ్చి బీట్ రూట్ ఆరోగ్యానికి చాలా మంచిదంట. ఇందులో విటమిన్స్, మినరల్స్, ఐరన్, ఫొటాషియం, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి.
ఇక పచ్చి బీట్ రూట్ రక్త హీనత ఉన్నవారికి చాలా మంచిది. ఎవరైతే రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారో, వారు పచ్చి బీట్ రూట్ తినడం వలన సమస్య నుంచి ఉపశమనం పొందుతారంట.
అలాగే, పచ్చి బీట్ రూట్ లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుచడమే కాకుండా, ఇది బీపీని నియంత్రించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు వైద్యులు.
పచ్చి బీట్ రూట్ ప్రతి రోజూ తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుందంట. అలాగే జీర్ణక్రియను మెరుగు పరిచి, మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
అయితే ఆరోగ్యానికి మేలు చేసే బీట్ రూట్‌ను గర్భిణీలు తీసుకోవడం మంచిదే అయినప్పటికీ, దీనిని అతిగా తీసుకోకూడదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.