కరివేపాకును తీసి పారేయ్యకండి.. దీంతో బోలెడు లాభాలు!

Samatha

22 july  2025

Credit: Instagram

సాంబార్ లేదా పప్పు చారులో కరివే పాకు వేస్తే ఆ రుచినే వేరే లేవల్‌లో ఉంటుంది. అంతే కాకుండా చాలా కూరల్లో దీని వేయడం వలన వంటలకే కొత్త టేస్ట్ వస్తుంది.

అయితే మనం ఎప్పుడూ వంటల్లో ఉపయోగించే కరివేపాకు వలన బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వలన దీనిని తినడం వలన ఒత్తడి తగ్గడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

అలాగే కరివేపాకు జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపించి, జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది. మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది.

ప్రతి రోజూ కరివేపాకు తినడం వలన ఇందులో ఉండే గ్లైసామిక్ రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిలను తగ్గించి చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది.

అలాగే కరివేపాకు ప్రతి రోజూ వంటల్లో ఉపయోగించడం వలన ఇది జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది.

కంటి ఆరోగ్యానికి కూడా కరివేపాకులు చాలా మంచివి. ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

కరివేపాకులో విటమిన్ E వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి చర్మ సమస్యలు తగ్గించి, చర్మాన్ని నిగారింపుగా చేస్తాయి.