నాగపంచమి రోజు నాగదేవతకు నైవేద్యంగా పాలే ఎందుకు పోస్తారో తెలుసా?
Samatha
24 july 2025
Credit: Instagram
హిందువులకు ఇష్టమైన పండుగల్లో నాగపంచమి ఒకటి. 2025వ సంవత్సరంలో తెలుగు క్యాలెండర్ ప్రకారం జూలై 29న నాగుల పంచమి జరుపుకోనున్నారు
శ్రావణ మాసంలోని శుక్ల పక్షంలోని ఐదవ రోజున నాగ పంచమి జరుపుకోవడం, నాగదేవతను పూజించడం వలన సర్పదోషం తొలిగిపోతుందని చెబుతుంటారు ప
ెద్దవారు.
ఇక ఈ సారి శ్రావణ మాసంలో శుక్ల పక్ష పంచమి తిథి జూలై 28 రాత్రి 11.24 నిమిషాలకు ప్రారంభమైన జూలై 30 తెల్లవారు జామున ముగుస్తుంది.
ఉదయతిథి ప్రకారం నాగపంచమి పండుగను జూలై 29న జరుపుకుంటారు. ఈ రోజు ఉదయం 5.41 నిమిషాల నుంచి 8.23 నిమిషాల వరకు పూజకు మంచి సమయం
అయితే నాగ పంచమి రోజు భక్తులందరూ నాగదేవతను నిష్టగా ఉపావాసలు ఉండి, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుచుకుంటారు.
ఇక నాగపంచమి రోజున నాగ సర్పాలకు పాలను నైవేద్యంగా పెడుతారు. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు పాలనే నాగదేవ
తకు ఎందుకు నైవేద్యంగా పెడుతారో?
ఇప్పుడు దాని గురించే వివరంగా తెలుసుకుందాం. నాగపంచమి రోజున నాగదేవతకు పాలను నైవేద్యంగా పెట్టడం వెనుక పెద్ద కారణం ఉన్నదంట.
మహాభారతంలో, జనమేజయ రాజు తన మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి సర్ప సంహారం యజ్ఞం చేస్తాడు, ఆ యజ్ఞనానికి హాజరైన అనేక పాము
లు కాలి బూడిద అవుతాయంట.
అప్పుడు ఆస్తిక ఋషి యజ్ఞాన్ని ఆపి, సర్పాలను రక్షించి, కాలిపోతున్న వాటిని పాలతో తగ్గించాడు. అప్పటి నుండి, నాగ దేవుడిని పాలతో పూజిస్తారంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : కలలు నిజం చేసుకోవాలంటే పాటించాల్సిన టిప్స్ ఇవే!
కరివేపాకును తీసి పారేయ్యకండి.. దీంతో బోలెడు లాభాలు!
వాస్తు టిప్స్ : బెడ్ రూమ్లో వాటర్ బాటిల్ ఉండటం మంచిదేనా?