చలికాలంలో ముల్లంగి తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

Samatha

15 November 2025

ముల్లంగి ఎక్కువగా సాంబార్‌లలో వినియోగిస్తుంటారు. దీనిని ఏ వంటల్లో వేసినా, రుచి అద్భుతంగా ఉంటుంది. అయితే ముల్లంగి వలన టేస్ట్ బాగుండటమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట.

ముల్లంగిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా దీనిని చలికాలంలో తినడం వలన ఇది శరీరానికి చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.

కాగా, అసలు ముల్లంగి తినడం వలన ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి. దీని వలన కలిగే ఆరోగ్య లాభాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

ముల్లంగిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువలన దీనిని  చలికాలంలో తినడం వలన ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.

ముల్లంగి తినడం వలన ఇది శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపేసి, ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గిస్తుంది. లివర్ పనితీరును మెరుగు పరుస్తుంది.

ముల్లంగిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందువలన బరువు తగ్గాలి అనుకునే వారు తమ ఆహారంలో ముల్లంగి చేర్చుకోవడం చాలా మంచిది.

ముల్లంగి శ్వాస సమస్యలతో బాధపడే వారికి వరం అని చెప్పాలి. ఇందులో సహజ యాంటీ ఇన్ ఫ్లమెంటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన ఇది శ్వాస సమస్యలను తగ్గిస్తుంది.

డయాబెటీస్ పేషెంట్స్‌కు కూడా ఇది చాలా మంచిది. దీనిని ఆహారంలో చేర్చుకోవడం వలన ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.